Prabhas bollywood debut action jackson

prabhas in action jackson, prabhas bollywood movie, prabhas latest movie updates, prabhas bahubali bulgaria shooting updates, prabhas bahubali latest photos, rajamouli latest movie updates, tollywood latest news updates, anushka movie updates, tamanna movie updates photos, action jackson movie review, actions jackson movie updates

prabhas bollywood debut action jackson : tollywood young rebal star prabhas made fans shocked by his silent entry into bollywood. december 5th released action jackson have a guest appearance of bahubali hero prabhas at end of movie, but till movie released this maintained secrecy

షాక్ : సైలెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘బాహుబలి’

Posted: 12/05/2014 03:52 PM IST
Prabhas bollywood debut action jackson

రెండేళ్ళుగా ఒకే సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ అభిమానులకు సర్ ప్రైజ్ తో పాటు షాక్ కూడా ఇచ్చాడు. ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా విడుదల అయ్యే వరకు ప్రభాస్ అందులో నటించినట్లు కనీసం ‘బాహుబలి’ యూనిట్ కు కూడా తెలియకపోవటం ఆశ్చర్యం కల్గిస్తోంది. బాలీవుడ్ మూవీ ‘యాక్షన్ జాక్సన్’ శుక్రవారం (డిసెంబర్ 05)న విడుదల అయింది. ఇందులో ప్రభాస్ ఓ గెస్ట్ రోల్ చేశాడు. సినిమా క్లైమాక్స్ లో ఒక నిమిషం సీన్ లో యంగ్ రెబల్ స్టార్ నటించాడు.

సినిమాలో ప్రభాస్ ను చూసిన తెలుగు ప్రేక్షకులు షాక్ అయ్యారు. కనీసం రూమర్ గా కూడా ఈ విషయం బయటకు రాలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీన్ కోసం ప్రభాస్ ప్రత్యేకంగా ముంబైకి వెళ్ళలేదు. కేవలం సరదాగా డైరెక్టర్ ప్రభుదేవాతో ఉన్న స్నేహంకొద్ది చేశాడు అని ప్రభాస్ సన్నిహితులు చెప్తున్నారు. ‘బాహుబలి’ షూటింగ్ రామోజీ ఫిలింసిటిలో జరుగుతున్న సమయంలో.., ‘యాక్షన్ జాక్సన్’ మూవీ ఒక షెడ్యూల్ పార్ట్ కూడా ఫిలింసిటీలో షూట్ చేశారు. ఈ సమయంలోనే ప్రభాస్ ను కలిసిన ప్రభుదేవా.., గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వాలని కోరాడు. ఇందుకు సరేనంటూ ఓ సీన్ లో ప్రభాస్ నటించాడని తెలుస్తోంది. గతంలో ప్రభాస్ తో ‘పౌర్ణమి’ మూవీని ప్రభుదేవా డైరెక్ట్ చేశాడు.

ప్రభాస్ గెస్ట్ అప్పియరెన్స్ తో తెలుగులో ‘యాక్షన్ జాక్సన్’ మూవీకి ఎక్కువ క్రేజ్ వస్తుందని మూవీ యూనిట్ భావించింది. ‘బాహుబలి’ సినిమా పూర్తయ్యే వరకు మరోసినిమా చేయనని రాజమౌళికి మాట ఇచ్చిన రెబల్ ఈ మూవీతో తప్పాడు అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే తెలుగు మూవీ కాకపోవటం అందులోనూ లీడ్ రోల్ చేయనందు వల్ల ప్రభాస్ మాట తప్పలేదనే భావించాలి. ఇక ప్రభాస్ తో పాటు ప్రభుదేవా, సల్మాన్ ఖాన్ కూడా ఈ మూవీలో అక్కడక్కడా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు.  ‘బాహుబలి’ మూవీ యూనిట్ బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటోంది.

అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన ‘యాక్షన్ జాక్సన్’ మూవీ భారీ అంచనాల మద్య విడుదల అయింది. సోనిక్షి సిన్హా, యామి గౌతమ్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు. పాటలు హిట్ కావటంతో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని భావించారు. అయితే దురదృష్టవశాత్తు ఈ మూవీ అభిమానులను అంతగా ఆకట్టుకోవటంలేదు. కొన్ని తెలుగు సినిమాలను కలిపి ఈ మూవీని తెరకెక్కించినట్లు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas  action jackson  bollywood  ajay devgan  

Other Articles