Anasuya debut film tollywood police role pvp banner

anasuya in films, anasuya enters movies, anchor anasuya film, anchor anasuya police role film, anchor anasuya in pvp banner movie, pvp banner next movie updates, anasuya pvp banner movie name, tollywood latest news updates, anchor anasuya latest updates

anasuya debut film tollywood police role pvp banner

పవన్ ను అవమానించి.. ఫ్రెండ్ తో జతకట్టిన అనసూయ...?

Posted: 12/05/2014 11:18 AM IST
Anasuya debut film tollywood police role pvp banner

అందం, అభినయం, మాటలతో బుల్లి తెరను హీటెక్కించిన హాట్ యాంకర్ అనసూయ సినిమాల్లోకి వస్తుందని ఆ మద్య ప్రచారం జరిగింది. కాని కొన్నాళ్ళ తర్వాత పుకార్లు పక్కనబెట్టేసి ప్రొగ్రాంలు చేసుకుంటోంది. అయితే హాట్ బ్యూటి గురించి మళ్ళీ రూమర్లు మొదలయ్యాయి. ఈ సారి ఏకంగా సినిమా బ్యానర్ తో పాటు చేసే గెటప్ కూడా ప్రకటిస్తూ.., కృష్ణా నగర్ నుంచి ఫిలింనగర్ వరకు అంతా గుసగుసలాడుకుంటున్నారు. ప్రముఖ సంస్థ పీవీపీ బ్యానర్ లో ఈ ఆంటి సినిమా చేస్తుందని అంటున్నారు. తొలి సినిమాలో పోలిస్ క్యారెక్టర్ లో నటించనుందని వార్తలు వస్తున్నాయి.

ఈ ఊహాగానాలపై అధికారిక సమాచారం లేకపోయినా.., ప్రస్తుతం పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఎందుకంటే గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ స్వయంగా ఆఫర్ ఇచ్చినా అనసయ తిరస్కరించింది. అలాంటిది ఇప్పుడు పవన్ తో సన్నిహితంగా ఉండే పొట్లూరి వరప్రసాద్ బ్యానర్ లో సినిమా చేసేందుకు అంగీకరించటంపై ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే గతంలో సినిమా వద్దని చెప్పటానికి అప్పుడున్న పరిస్థితులే కారణం తప్ప పవన్ ను అవమానించటం కాదని ఆమె సన్నిహితులు చెప్తున్నారు.

పెద్ద బ్యానర్, మంచి రెమ్యునరేషన్ కావటంతో టెంప్ట్ అయి ఉంటుందని అనుకుంటున్నారు. జబర్దస్త్ టీవీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి బాగా పాపులర్ అయింది. పలు కారణాలతో ఈ షో నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం తెలుగులోని ప్రముఖ ఛానెళ్ళలో వస్తున్న షోలలో నటిస్తూ బిజీగా మారింది. ఒక్క సినిమా చాన్సు కోసం ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న స్మాల్ స్ర్కీన్ కెరీర్ ను వదిలి పెట్టడం సాహసమనే చెప్పాలి. తొలి సినిమా హిట్ కావచ్చు కానీ..., తర్వాత చాన్సులు వస్తాయని గ్యారంటి ఏమిటి..? ఈ లోపు రేష్మి లాగ ఇతర షోలకు కొత్త భామలు వచ్చి నిలదొక్కుకుంటే రెంటికీ చెడ్డ రేవడిలా కెరీర్ తయారవుతుంది. ఈ విషయంలో అమ్మడి క్యాలుక్యులేషన్లు ఎలా ఉన్నాయో త్వరలోనే బయటకు వచ్చే అవకాశముంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anchor anasuya  debut  tollywood  pvp banner  pawan kalyan  

Other Articles