Bahubali movie shooting bulgaria schedule ramoji film city prabhas daggubati rana anushka shetty tamanna bhatia rajamouli

bahubali movie, bahubali movie schedules, bahubali movie news, bahubali movie shooting stills, bahubali movie shooting news, bahubali movie photos, hero prabhas, daggubati rana, prabhas daggubati rana, bahubali rana, bahubali prabhas, anushka shetty, anushka shetty bahubali, anushka shetty hot photos, tamanna bhatia, tamanna bhatia bahubali movie, director rajamouli, rajamouli latest news, rajamouli twitter, rajamouli bahubali, bahubali bulgaria shooting

bahubali movie shooting bulgaria schedule ramoji film city prabhas daggubati rana anushka shetty tamanna bhatia rajamouli

పతాకదశలో ‘బాహుబలి’ షూటింగ్...

Posted: 12/01/2014 11:36 AM IST
Bahubali movie shooting bulgaria schedule ramoji film city prabhas daggubati rana anushka shetty tamanna bhatia rajamouli

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతోప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘‘బాహుబలి’’. ఇందులో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా నటిస్తుండగా.. అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒక సంవత్సరానికిపైగా సెట్స్’పై వున్న ఈ పిరియాడిక్ మూవీని భారీ బడ్జెట్’తో ఆర్కా మీడియావారు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు ఆ చిత్రం టీం ఒక లాంగ్ షెడ్యూల్ కోసం డిసెంబర్ నెలలో బల్గేరియాకు వెళ్లనున్నారు.

ఇక తాజాగా అందుతున్న సమాచారాలప్రకారం.. ఈ మూవీ షూటింగ్ బల్గెరియా షెడ్యూల్’తో టాకీ పార్ట్ పూర్తి చేసుకుంటుందని టీం సభ్యులు చెబుతున్నారు. టాకీ పార్ట్ పూర్తికాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి వేగంగా పనులు ముగిస్తామని, వచ్చేఏడాది 2015 ఏప్రిల్’లో ఈ మూవీ ఫస్ట్ పార్ట్’ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. అయితే సెకండ్ పార్ట్’ని కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఏదైతేనేం.. బల్గేరియా షెడ్యూల్’తో షూటింగ్ ఫైనల్ అయిన వెంటనే అభిమానులకు సందడే సందడి అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

తొలిసారిగా తెలుగులో భారీ బడ్జెట్’తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. అలాగే అనుష్క, తమన్నాలు కూడా అద్భుతమైన స్టంట్స్’తో ప్రేక్షకులను అలరించడం ఖాయమని, అలాగే ప్రభాస్ - రానాల మధ్య జరిగే ఫైట్ సినిమాకి హైలైట్’గా నిలుస్తుందని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles