Megastar chiranjeevi 150 movie news scripts director ram charan next year shooting starts

chiranjeevi, chiranjeevi latest news, chiranjeevi 150 movie, chiranjeevi movie news, chiranjeevi ram charan, chiranjeevi parliament, chiranjeevi with family members, chiranjeevi movie 150 director, chiranjeevi movie news

megastar chiranjeevi 150 movie news scripts director ram charan next year shooting starts

తెలుగు అభిమానులపై చిరంజీవి ఢమాల్..?

Posted: 11/29/2014 05:24 PM IST
Megastar chiranjeevi 150 movie news scripts director ram charan next year shooting starts


తెలుగు అభిమానులకు బ్యాడ్ న్యూస్! ఇన్నాళ్లవరకూ ఎంతగానో ఊరించిన చిరు 150వ చిత్రానికి సంబంధించి తాజాగా ఒక వార్త వెలువడింది. ఎప్పుడో ఆగస్టు నెలలో తన చిత్రం గురించి వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్న చిరు.. ఇప్పుడు డిసెంబర్ వచ్చేసింది కానీ ఇంకా దానిమీద ఎలాంటి సమాచారాన్ని స్పష్టం చేయలేదు. తొలువ చిరంజీవి పుట్టనరోజే 150 మూవీ గురించి క్లారిటీ వస్తుందని అప్పట్లో వార్తలొచ్చాయి. పైగా తన బర్త్’డేనాడు మూవీ విషయాల గురించి వెల్లడించే అవకాశముందని చిరు అప్పట్లో వెల్లడించిన సందర్భాలూ వున్నాయి. దాంతో ఆయన పుట్టినరోజు సినిమా విషయాలు వెల్లడవుతాయని అభిమానులు ఎంతగానో వెయిట్ చేశారు. కానీ చిరు తన బర్త్’డే సందర్భంగా నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని ఎప్పుడైతే సందర్శించారో.. అప్పటినుంచి మూవీగురించి పల్లెత్తుమాట కూడా మాట్లాడలేదు చిరు! అసలు ఆ చిత్రానికి, తనకు సంబంధం లేనట్లుగానే ఇన్నాళ్లు ఆయన వ్యవహరించారని విశ్లేషకులు అనుకుంటున్నారు.

అయితే ఈలోగా ఆ నేపాల్ టూర్ వెనుకున్న కొన్ని రహస్యాలు బయటపడ్డాయి. చిరు నేపాల్’లోని ఆలయాన్ని సందర్శించి, తన చిత్రం గురించి జ్యోతిష్యులను సంప్రదిస్తే వాళ్లు కొన్ని సలహాలు ఇచ్చారని సమాచారం! ఆ సమయంలో ఆయన ఇంటికి గృహదోషం వుందని, త్వరగా ఇంట్లో కొన్ని మార్పులు చేయాలని వాళ్లు సూచించారట! అలాగే కార్తీకమాసం పూర్తియ్యేంతవరకు మూవీ ప్రాజెక్ట్ ప్రారంభించడం మంచిది కాదని వాళ్లు సలహాలు ఇచ్చారట! అందువల్లే ఆయన ఇన్నాళ్లూ తన సినిమాపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్’గా వుండాల్సి వచ్చింది. అయితే కార్తీకమాసం కూడా ముగిసి కొన్నిరోజులయ్యింది. ఇంకా 150వ చిత్రానికి సంబంధించి ఎలాంటి జాడలేదు. మొన్నామధ్య ఆయన కొన్ని స్ర్కిప్ట్స్ చదువుతున్నారని, మూవీ డైరెక్టర్ ఎవరో కన్ఫర్మ్ కూడా అయ్యారని వార్తలొచ్చాయి కానీ.. ఆ మూవీ నిర్మాత చరణ్ మాత్రం ఒక టీవీ షోలో అవి కేవలం రూమర్లు మాత్రమేనని కొట్టిపారేశారు.

ఇక తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం.. ఈ ఏడాదిలో ఆ చిత్రానికి సంబంధించి వివరాలు వెల్లడయ్యే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇప్పటివరకు చిరంజీవి ఏ స్టోరీని ఫైనల్ చేయలేదని, ఇంకా ఆయన ఆ డైలమాలోనే వున్నారని సమాచారం! పైగా శీతాకాల పార్లమెంటు సమావేశాలు కూడా మొదలుకావడంతో అందులో ఆయన బిజీ అవ్వాల్సి వచ్చింది. ఈ లెక్కప్రకారం.. డిసెంబర్’లో కూడా చిత్రవిశేషాలు వెలువడటం కష్టమేనని అంటున్నారు. వచ్చేఏడాదిలో పూర్తి వివరాలు వెల్లడవుతాయనే సమాచారాలు అందుతున్నాయి కానీ.. ఖచ్చితంగా ఎప్పుడనేది మాత్రం క్వశ్చన్ మార్క్? మరోవైప మెగాఫ్యాన్స్ డిసెంబర్’లోనే డీటేల్స్ బయటకొస్తాయని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు కానీ.. మెగాకుటుంబం నుంచి ఎటువంటి అధికారక ప్రకటనలు మాత్రం వెలువడటం లేదు. మరి చిరు తన 150వ చిత్రంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : megastar chiranjeevi  ram charan  chiru 150 movie news  tollywood  telugu audience  

Other Articles