Nagarjuna and karthi multi starrer movie starts from december

nagarjuna karthi multistarrer movie, nagarjuna karthi multistarrer movie shooting update, nagarjuna karthi movie latest updates, nagarjuna karthi multistarrer movie heroine, tollywood latest updates

nagarjuna and karthi multi starrer movie starts from december : According to the latest update, the shooting of nagarjuna and karthi combination multistarrer film will kick start in December

మల్టీ స్టారర్ కు ముహూర్తం రెడి.. ఇద్దరి మద్య హీరోయిన్ వివాదం

Posted: 11/18/2014 05:58 PM IST
Nagarjuna and karthi multi starrer movie starts from december

అక్కినేని అభిమానులకు పండగ లాంటి వార్త వచ్చేసింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాగార్జున - కార్తి మల్టీస్టారర్ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే నెల అంటే డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు2 షోలో బిజీగా ఉన్నాడు. అటు కార్తి కూడా ‘కొంబన్’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. వీరిద్దరి షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే పూర్తి కానుంది.

ప్రస్తుత షెడ్యూల్ పూర్తి కాగానే.., నాగ్ - కార్తి మల్టీస్టారర్ సినిమా షూటింగ్ మొదలు కానుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీవీపీ బ్యానర్స్ నిర్మిస్తోంది. ఒకేసారి తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్ చాన్స్ కొట్టేసే అవకాశం ఉంది. అయితే ఒకే హీరోయిన్ ఎంపిక అవుతుందా లేక ఇద్దరిని సెలక్ట్ చేస్తారా అనేది ఇంకా తెలియదు. అయితే ఇద్దరు హీరోలున్న సినిమాలో ఒకే హీరోయిన్ ఉండటం కొత్తేమి కాకపోయినా.., ఇద్దరూ రెండు ఇండస్ర్టీల్లో క్రేజ్ ఉన్న హీరోలు కావటంతో హీరోయిన్లు తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. నాగార్జున గతంలో హరికృష్ణ, సుమంత్ తదితర హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు నటంచి మెప్పించాడు. ఆ తర్వాత తాజాగా అక్కినేని ఫ్యామిలి అంతా కలిసి ‘మనం’ సినిమాలో నటించి రికార్డు సృష్టించాడు. ఇలా విభిన్నమైన కథలతో సినిమాలు చేసే నాగార్జున తాజా మల్టీ స్టారర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ హీరోలు కావటంతో సినిమా ఎల ఉంటుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే మీకు అందిస్తాము.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagarjuna  karthi  multi starrer  latest news  

Other Articles