Sonakshi sinha on her future projects

sonakshi sinha movies, sonakshi sinha next movie, sonakshi sinha on her future projects, sonakshi sinha rajinikanth movie, sonakshi sinha in lingaa movie, sonakshi sinha latest hot photos, tollywood latest updates, bollywood latest updates, family entertainer movies

sonakshi sinha on her future projects : heroine sonakshi sinha says she will not act in galmour roles and in exposing characters in future. soon all family members come together to watch my movie because i will not expose overly says sonakshi

కష్టమైనా.. ప్రతి ఒక్కర్నీ సాటిస్ఫై చేస్తా

Posted: 11/18/2014 02:43 PM IST
Sonakshi sinha on her future projects

పాతనీరు పోయి కొత్త నీరు వచ్చినట్లుగా ప్రస్తుతం బాలీవుడ్ లో పాత హీరోయిన్ల కంటే సోనాక్షి సిన్హా పేరు ఎక్కువగా విన్పిస్తోంది. కమర్షియల్ సినిమాలతో కొట్టడంతో పాటు.., స్టోరీ ఓరియంటెడ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. దీంతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అని పేరు పడిపోయింది. ఇప్పుడందరి నోటా సోను పేరు విన్పిస్తోంది. బాలీవుడ్ సినిమాలతో పాటు రజినీ ‘లింగా’తో సౌత్ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టింది. దీంతో క్రేజ్ మరింత పెరిగింది. అమ్మడితో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు.

ఇలా వరుసగా సినిమాలు వంద కోట్ల కలెక్షన్ మార్కును దాటడంతో పాటు.., కెరీర్ కూడా మంచి పీక్ స్టేజిలో ఉండటానికి గల సక్సెస్ సీక్రెట్ ఏమిటో సోను బయట పెట్టింది. కలెక్షన్లు, సెన్సేషన్ క్రియేషన్లను ఊహించకుండా కేవలం ప్రేక్షకులకు నచ్చేలా నటించాలి అనే ఉద్దేశ్యంతో సినిమాల్లో పాత్రలు పోషిస్తానని చెప్తోంది. సినిమా చూసేందుకు డబ్బుతో పాటు విలువైన కాలాన్ని వెచ్చించి ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు. అలాంటి వారిని నిరాశపరిస్తే భవిష్యత్తు ఎలా అని ప్రశ్నిస్తోంది. అందుకే గ్లామర్ కంటే.., కుటుంబం అంతా కలిసి వచ్చి చూసే కధలను ఎక్కువగా ఎంచుకుంటాను అని చెప్తోంది.

అంతేకాదు ఇకపై తన సినిమాల్లో ఎక్కువగా ఎక్స్ పోజింగ్ ఉండకుండా చూసుకుంటానని హామి ఇస్తోంది. ప్రేక్షకులను సంతృప్తి పరిస్తే వచ్చే ఆనందం వందల కోట్ల కంటే విలువైనది అని.., ఇందుకోసం ఎంతయినా కష్టపడతాను అని చెప్తోంది. ఇక తన సినిమాలకు కష్టపడేతత్వంకు తోడు అదృష్టం కూడా వెంట ఉందని అంటోంది. లేకపోతే ఇవాళ అందరూ తపించేలా స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని కాదేమో అని సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రేజీ భామ నటించిన ‘లింగా’ తెలుగులో కూడా వచ్చే నెలలో విడుదల కానుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonakshi sinha  bollywood  lingaa  family entertainer  

Other Articles