Hansika interview getting more movie offers and stardom in small image comparing with other heroines

hansika motwani, hansika latest news, hansika news, hansika hot photos, hansika movies, hansika biography, hansika interview, hansika hot photo shoot, hansika press meet, hansika movie updates, hansika motwani movie career

hansika interview getting more movie offers and stardom in small image comparing with other heroines

చిన్నవయస్సులోనే అందరూ సంతృప్తిపరిచారట..

Posted: 11/17/2014 03:37 PM IST
Hansika interview getting more movie offers and stardom in small image comparing with other heroines

చిన్న వయస్సులోనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన తారల్లో బొద్దుగుమ్మ హన్సిక కూడా ఒకరు. ఈమె ఇండస్ట్రీలో వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి కథానాయికగా పేరు తెచ్చుకోవడంతోపాటు వరుస విజయాలతో దూసుకుపోతోంది. అంతేకాదు.. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపు ఏడు సినిమాలు వున్నాయి. ఒకప్పుడు కేవలం ఒకటి లేదా రెండు సినిమాలతోనే బిజీగా వుండే ఈ బొద్దుగుమ్మ.. ఇప్పుడు ఒకేసారి ఇన్ని ఆఫర్లు రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సెక్సీతార మీడియాతో తన సినీ అనుభవాలు, ఇతర విషయాలను పంచుకుంది.

‘‘ఇంత చిన్న వయస్సులోనే చాలా విజయాలు సాధించారు కదా.. మరి మీకేమనిపిస్తోంది..?’’ అన్న అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ‘‘నా వయస్సులో వున్నవాళ్లంతా జీవితంలో ఇంకా స్థిరపడలేదు. కానీ నేను నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాను... లక్షలమంది నన్ను గుర్తుపడతారు... అందరూ నా గురించే మాట్లాడుకుంటారు. ఇదంతా నాకెంతో సంతృప్తినిస్తోంది. ఆ అనుభవాలన్నీ అంతా బాగానే వుంటాయి. కానీ నేను విజయాల్ని తలచుకొంటూ కూర్చోను. సెట్లో అడుగుపెడితే ఇప్పటికీ భయంగానే వుంటుంది. సెట్లో తప్పు చేయకూడదని తలుచుకుంటుంటాను. గొప్ప నటి అని కాకపోయినా.. ప్రస్తుతమున్న ఇమేజ్ ను చెడగొట్టుకోకూడదని చాలా జాగ్రత్తలు పాటిస్తున్నా’’ అని వెల్లడిచ్చింది అమ్మడు.

అలాగే మాట్లాడుతూ.. ‘‘విజయాల్ని ఎప్పుడూ తలకెక్కించుకోకూడదు. అలా చేస్తే గర్వం వచ్చేస్తుంది.. అహంకారం పెరిగిపోతుంది. అప్పుడు తెలిసీ తెలియక అనుకోకుండా ఎన్నో తప్పులు జరిగే అవకాశాలుంటాయి. అందుకే నేను ఎప్పుడూ విజయాల్ని పట్టించుకోను. పరిస్థితులకు అనుగుణంగా నన్ను నేను మలుచుకుంటూ.. అన్ని వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటిస్తాను’’ అని అంటోంది హన్నిక! ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఈ అమ్మడు తనగురించి ఇలా పేర్కొందా..? లేక ఇతర హీరోయిన్లను టార్గెట్ చేసి వాళ్లకు హితువులు పలుకుతోందా..? అన్నదే అర్థం కావడం లేదని సినీ విశ్లేషకుల సందేహం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hansika motwani  tollywood heroines  actresses photo shoots  telugu news  

Other Articles