Actress avika gor slaps hero naga shourya in lakshmi raave maa intiki movie

avika gor, avika gor news, avika gor telugu movie, lakshmi raave maa intiki movie, lakshmi raave maa intiki movie trailer, telugu hero naga shourya, hero naga shourya latest news, naga shourya movies, tollywood news, telugu news

actress avika gor slaps hero naga shourya in lakshmi raave maa intiki movie

లవ్వంటూ వెంటపడుతుంటే.. లాగి రెండు ఇచ్చింది!

Posted: 11/17/2014 04:09 PM IST
Actress avika gor slaps hero naga shourya in lakshmi raave maa intiki movie

అమ్మాయి అందంగా కనిపిస్తే చాలు.. ప్రతిఒక్కడు లవ్వంటూ తెగ వెంటపడిపోతుంటాడు. అమ్మాయి క్యారెక్టర్ ఏంటి..? తను ఎటువంటి కుటుంబం నుంచి వచ్చింది..? ఆమెకు అసలు పెళ్లయ్యిందా..? లేదా..? అన్న విషయాలు పట్టించుకోకుండా డైరెక్ట్ గా ఐలవ్ యూ చెప్పేయడం లేదా ఆమెను ప్రేమలో పడేయడానికి నానారకాలుగా తంటాలు పడుతుంటారు అబ్బాయిలు. ఆ తరహాలోనే ఒక హీరో, హీరోయిన్ అవికా గోర్ ని లవ్వంటూ వేధించడం మొదలుపెట్టాడు. అంతే కోపంతో రగిలిపోయిన ఆ అమ్మడు.. లాగి అతని చెంప మీద రెండు దెబ్బలు ఛళ్లుమనిపించింది. అదీ మేటర్! అయితే ఇదంతా జరిగిందీ రియల్ లైఫ్ లో కాదండోయ్... రీల్ లైఫ్ లో మాత్రమే!

‘‘ఉయ్యాలా జంపాలా’’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అవికాగోర్.. మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. దీంతో ఈ అమ్మడికి ఒకదాని తర్వాత మరొకటి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు ‘‘లక్ష్మీరావే మా ఇంటికి’’ అనే సినిమాలో నటిస్తోంది. హీర నాగశౌర్య - అవికా కాంబినేషన్ లో యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా రానుంది! ఆదివారంనాడు ఆ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది! ఈ సందర్భంగా ఆ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అందులో అవికా, హీరో నాగశౌర్య చెంపల మీద అటూఇటూగా కొట్టే సన్నివేశం వుంది. గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద్యాల రవి దర్శకత్వం వహించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles