Kamal to act in tipu sultan biopic

kamal in tipu sultan biography movie, tipu sultan biography movie, kamal hassan in viswaroopam2 movie photos, kamal hassan viswaroopam2 movie release, kamal hassan uthama villain movie release date, uthama villain movie photos songs, kamal hassan in papanasam, papanasam movie release date, papanasam movie latest updates photos, koliwood latest updates, indian kings ruling, karnataka ruling kings

kamal to act in tipu sultan biopic : legendry actor kamal hassan completed his movies viswaroopam2, uthama villain, papanasam and now plans to act in tippu sultan bio pic movie official announcement will come soon

మహారాజు అవుతాడట.. చూద్దాం

Posted: 11/14/2014 04:37 PM IST
Kamal to act in tipu sultan biopic

భారత సినిమా పరిశ్రమ గర్వించిదగిన నటుల్లో కమల్ హాసన్ ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ సహా పలు భారత భాషల్లో అనేక సినిమాలు నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించటంలో కూడా కమల్ కు ఎవరూ సాటిరారు. అలాంటి మేటి నటుడు మరో ప్రయత్నం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఒకనాటి మైసూర్ సామ్రాజ్య మహారాజుగా టిప్పు సుల్తాన్ జీవిత కధను సినిమాగా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నాడు. అంటే మైసూర్ మహారాజు పాత్రలో కమల్ కన్పించనున్నాడు.

ఆయన తాజాగా నటించిన ‘విశ్వరూపం2’, ‘ఉత్తమ విలన్’, ‘పాపనాశం’ సినిమాల షూటింగ్ పూర్తయింది. వీటి విడుదల తేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. కమల్ సన్నిహితులు చెప్తున్న ప్రకారం ముందుగా ‘ఉత్తమ విలన్’ విడుదల అయి ఆ తర్వాత ‘పాపనాశం’ సినిమా వస్తుంది. చివరగా ‘విశ్వరూపం2’ చూపిస్తారని అంటున్నారు. ఈ సినిమాలు వరుసగా విడుదల అవుతున్నా.., ఒక్కో సినిమాకు దాదాపు నెల రోజులు అయినా గ్యాప్ ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టిప్పు సుల్తాన్ జీవిత కథా చిత్రంలో కమల్ నటించటంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan  tipu sultan  koliwood  latest news  

Other Articles