Allu arjun son ayaan childrens day celebrations

stylish star, Mr perfect, bunny, Allu Arjun, Allu Arjun son, Ayaan, Childrens Day Celebrations, Telugu news, tollywood news, Mega family

Allu Arjun son Ayaan Childrens Day Celebrations

అయాన్ చిల్ర్డన్ డే విశెస్ (ఫొటోలు)

Posted: 11/14/2014 01:31 PM IST
Allu arjun son ayaan childrens day celebrations

బాలల దినోత్సవం.. అంటే బాలలకు ఎంతో ఇష్టం.. దేశ ప్రధమ ప్రధాని చాచా నెహ్రూకు చిన్నారి బాలబాలికలంటే ఎంతో ఇష్టమని ఆయన తన జన్మదినాన్ని బాలలు దినోత్సవంగా జరుపుకోవాలని నిశ్చయించడంతో..అనాటి నుంచి నవంబర్ 14 వచ్చిందంటే చాలు సంబరాలు జరుపుకుంటారు బాలబాలికలు. ఇక పాఠశాల్లలో అయితే చిన్నారుల కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి వారిని సంతోషపెడతారు. విద్యార్థులకు చాక్లెట్ లు పంచుతారు. విద్యార్థులతో కలసి ఉపాధ్యయులు ఫోటోలు కూడా తీసుకుంటారు. ఇది ప్రతీ పాఠశాలలోనూ జరిగే వేడుక.

కానీ ఈ ఫోటోలో కనబడుతున్న బుజ్జాయ్ ఎవరో తెలుసా..? ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు.. అని అలపిస్తున్న గానాన్ని పక్కన బెట్టి నెహ్రూ గారి చిన్ననాటి ఫోటో అంటారా..? మీరు పొరబడుతున్నారు. అతను చిన్ననాటి ఛాఛా నెహ్రూ కాదు. మీరు అలా అనుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదు. బాలల దినోత్సవం రోజున.. అందులోనూ శాంతికి ఆలవాలమైన శ్వేతవర్ణ దుస్తులు ధరించి.. ఎర్రటి గులాబి పెట్టుకుని ముద్దులొలికే బోసి నవ్వులు చిందిస్తుంటే.. ఎవరు మాత్రం పొరబడరు.. ఛాఛా గారంత ఎత్తుకు ఎదగుతానని ఇప్పుడే సింబాలిక్ గా చెబుతున్న ఈ బుజ్జాయి మిస్టర్ ఫర్ఫెక్ట్  అల్లు అర్జున్ (బన్ని) గారాల పట్టి. అల్లు గారి వంశంలో వరుసగా తరానికి తరానికి సంక్రమిస్తున్న పుత్రోత్సాహం.. బన్నికి కూడా కలగాలని ఆశిస్తూ.. బుల్లి చాచా అయాన్ కి బెస్ట్ విషెస్ చెబుదాం...

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles