Pawan kalyan gopala gopala movie teaser by fan made

pawan kalyan gopala gopala first look, gopala gopala teaser video, gopala gopala fan made teaser, gopala gopala trailer and posters, gopala gopala release date, gopala gopala latest news, tollywood latest updates, venkatesh in gopala gopala photos

pawan kalyan gopala gopala movie teaser by fan made : power star pawan kalyan latest movie gopala gopala movie teaser video of fan made creating sensation and getting huge response in youtube

పవన్ ‘‘గోపాల గోపాల’’ ఫస్ట్ లుక్ టీజర్ (వీడియో)

Posted: 11/11/2014 05:28 PM IST
Pawan kalyan gopala gopala movie teaser by fan made

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న తాజా సినిమా ‘గోపాల గోపాల’ గురించి ఏ వార్త వచ్చినా అదో సెన్షేషన్ అవుతుంది. అలాంటిది ఏకంగా చెప్పాపెట్టకుండా టీజర్ వచ్చేసింది అంటే మామూలు విషయమా. కాని ఇప్పుడదే జరిగింది. ‘గోపాల గోపాల’ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వీడియో యూ ట్యూబ్ లో విడుదల అయింది. అయితే ఇది సినిమా యూనిట్ విడుదల చేసింది కాదు. పవర్ స్టార్ అభిమాని ముచ్చటపడి చేసి విడుదల చేశాడు. ఇప్పుడీ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. విడుదల అయిన మూడ్రోజుల్లోనే లక్ష మందికి పైగా ఈ వీడియోను చూశారు.

అభిమాని సరదాకు చేసిన ఈ వీడియో ఇంటర్నెట్ లో సంచలనం కల్గించటంతో యూనిట్ వర్గాలు స్పందించాయి. టీజర్ ను తాము ఇంకా విడుదల చేయలేదని ప్రకటించాయి. ముందుగా చెప్పినట్లు నవంబర్ చివర్లో ఫస్ట్ లుక్ బయటకు వస్తుందని అంటున్నారు. ఇక ఫ్యాన్స్ తయారు చేసిన వీడియోకే ఇంత క్రేజ్ ఉంటే.., సినిమా యూనిట్ ఒరిజినల్ టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేస్తే ఏ మాత్రం ఉంటుందో ఊహించవచ్చు. అప్పట్లో బిలియన్ డే సేల్ స్పందనకు ఫ్లిప్ కార్ట్ సర్వర్ డౌన్ అయినట్లుగా పవర్ వీడియోతో యూ ట్యూబ్ సర్వర్ డౌన్ అయినా కావచ్చు అంటున్నారు అభిమానులు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. వారణాసి సీన్లు పూర్తయితే ఇక షూటింగ్ ముగిసినట్లే. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో సినిమాను నిలిపేందుకు బాగా కష్టపడుతున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాఢ్’ సినిమాకు రీమేక్ గా వస్తున్న ‘గోపాల గోపాల’లో పవన్ మోడ్రన్ కృష్ణుడి అవతారంలో దర్శనం ఇవ్వనుండగా.., శ్రియ పవన్ భక్తురాలిగా కన్పించనుంది. ఈ మల్టీస్టారర్ మూవీలో వెంకటేష్ శ్రియ భర్తగా నటిస్తున్నాడు. ప్రస్తుతానికి అభిమాని తయారు చేసిన ఈ వీడియో చూడండి. త్వరలోనే ఒరిజినల్ టీజర్ తో మీ ముందుంటాము.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala gopala  pawan kalyan  latest news  teaser  

Other Articles