Krish next telugu dubbing movie name announced

krish next movie, krish movies latest updates, saivam telugu remake movie name, daagudu moothala dandekar movie updates, tollywood latest updates

krish next telugu dubbing movie name announced : telugu content oriented film director krish is remaking saivam movie from tamil to telugu. saivam movie telugu remake name is daagudu moothala dandekar, soon movie shooting will started

ఇదేదో పిల్లలాటలా ఉంది

Posted: 11/11/2014 05:01 PM IST
Krish next telugu dubbing movie name announced

కంటెంట్ ఉన్న సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్ తెలుగులో మరో సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడని తెలుస్తోంది. తమిళంలో హిట్ అయిన ‘సైవం’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నాడని టాక్. ఈ మూవీకి ‘దాగుడు మూతల దండాకోర్’ అని పేరు పెట్టినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. అయితే ఈ మూవీని క్రిష్ డైరెక్ట్ చేయటం లేదు. ఉషాకిరణ్ మూవీస్ తో కలిసి సినిమాను నిర్మించనున్నాడు.

‘గమ్యం’ సినిమాతో తెలుగు తెరకు టాలెంట్ ఏంటో చూపించిన క్రిష్ పలు మంచి సినిమాలు తీశాడు. అయితే అవి కమర్షియల్ హిట్ మాత్రం కాలేదు. చివరగా తెలుగులో ‘కృష్ణం వందే జగద్గురుం’ అనే సినిమాను తీశాడు. మిగతా వాటితో పోలిస్తే ఇది కమర్షియల్ గా కాస్త క్లిక్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ముంబైకి వెళ్ళి ‘ఠాగూర్’ ను హిందీలో ‘గబ్బర్’ పేరుతో రీమేక్ చేశాడు. అక్షయ్ కుమార్, శృతిహాసన్ జంటగా వచ్చిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

హిందీ రీమేక్ పూర్తి కావటంతో ఇక తెలుగు సినిమాలపై దృష్టి పెట్టాడు. అయితే డైరెక్టర్ గా కాకుండా నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాను క్రిష్ లా తీసే డైరెక్టర్ ఎవరు, అందులో హీరో, మిగతా నటులు ఎవరనేది త్వరలోనే తెలియజేస్తాం. డైరెక్టర్ గా మంచి కధలు ఇచ్చిన క్రిష్ కు నిర్మాతగా ఈ మూవీ మంచి కమర్షియల్ హిట్ ఇవ్వాలని కోరుకుందాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saivam  daagudu moothala dandekar  krish  latest news  

Other Articles