Director maruti searching for new talent for his latest movie

maruti movies, maruti next movie, maruti talent search acting auditions, tollywood latest news, movie, tollywood movie chances offers, latest telugu updates, movie acting chances

director maruti searching for new talents : telugu director maruti searching for new guys for his next movie, says he is ready to give cinema acting chance to new talent guys. maruti movie unit searching for new boys and girls for making movie with fresh look

ఫ్రెష్ స్టాక్ కోసం బోర్డు పెట్టేశాడు

Posted: 11/11/2014 02:41 PM IST
Director maruti searching for new talent for his latest movie

తెలుగులో యువతను టార్గెట్ చేసి సినిమాలు తీసే డైరెక్టర్ గా పేరున్న మారుతి, తన సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త వారు ఉండేట్లు చూసుకుంటాడు. అదేమంటే కొత్త కాన్సెప్టులు కాబట్టి, కొత్త యాక్టర్లు అని చెప్తాడు. ఇదే బాటలో తాను తీయబోతున్న కొత్త సినిమా కోసం నటుల వెతుకులాటలో పడ్డాడు. తాజా ప్రాజెక్టు యూత్ అట్రాక్షన్ సినిమా, ముగ్గురు జంటల నేపథ్యంగా కధ సాగుతుంది. అంటే ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కావాలన్నమాట.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నా..,. నటీ నటుల సెలక్షన్ పూర్తికాకపోవటంతో ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఆడిషన్ల పనిలో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఈ ఆఫర్ గురించి విన్న చాలామంది యువత, చాన్స్ కోసం ఎదురుచూస్తున్న వారు ఆడిషన్స్ అడ్రస్ కనుక్కుని వెళ్తున్నారట. ఆసక్తి ఉంటే మీరూ ట్రై చేయండి. వస్తే సినిమా చాన్స్. రాకపోతే మారుతిని కలిశామన్న గుర్తు మిగిలిపోతుంది అంతే.

యువతను టార్గెట్ చేసి సినిమాలు చేసి మొదట్లో సక్సెస్ అయ్యాడు. అయితే మితిమీరిన పంచ్ డైలాగులు, అందర్లో మాట్లాడుకోలేని పదాలు, వల్గారిటి ఉండే కధలతో సినిమాలు తీసి బూతు డైరెక్టర్ గా పేరు పొందాడు. అయినా సరే మారుతికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. వెరైటి, రియాలిటికి దగ్గరగా ఉండే ప్రేమకధా సినిమాలు చేయటంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి ఈ కొత్త ప్రాజెక్టుకు ఎవరు సెలక్ట్ అవుతారో ..., సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maruti  auditions  tollywood  latest news  

Other Articles