Ileana dcruz praises govinda special health class bollywood

ileana dcruz news, ileana news, ileana hot news, ileana hot photo shoot, ileana latest news, ileana hot photo shoot, ileana latest gallery, ileana happy endings movie, ileana bikini photo shoot, ileana govinda, govinda latest news, ileana saif ali khan

ileana dcruz praises govinda special health class bollywood

బాలీవుడ్ నటుడు ఇల్లీకి బాగానే క్లాస్ పీకాడట!

Posted: 11/11/2014 11:28 AM IST
Ileana dcruz praises govinda special health class bollywood

టాలీవుడ్ మీద అక్కసునంత వెళ్లగక్కేసి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలిగిపోదామని వెళ్లిన ఇలియానాకు ఇంతవరకు ఆ హోదా దక్కలేదు కానీ... అప్పుడప్పుడు అరకొర సినిమా అవకశాలైతే వస్తున్నాయి. అక్కడివెళ్లిన వెంటనే మొదటి సినిమా ‘బర్ఫీ’ భారీ విజయాన్ని మూటగట్టుకోవడంతో ఈ అమ్మడు తన దశ తిరిగిపోతుందని భావించింది కానీ.. ఆ తర్వాత ఎంతోకాలం నిరీక్షణ చేస్తేగానీ రెండు అవకాశాలొచ్చాయి. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ తో కలిసి నటిస్తుందనే వార్తను కాస్త పక్కపెడితే.. ప్రస్తుతం ఈ అమ్మడు సైఫ్ అలీఖాన్ తో కలిసి ‘హ్యాపీ ఎండింగ్స్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇల్లీ కూడా బాగానే చక్కర్లు కొడుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే అమ్మడు ఆ మూవీ షూటింగ్ సందర్భంలో తనతో జరిగిన కొన్ని ఆసక్తికరమైన వ్యవహారాలను వెల్లడించింది.

‘హ్యాపీ ఎండింగ్’ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా నటించిన విషయం తెలిసిందే! ఆ చిత్రంలో గోవిందా, సైఫ్ అలీఖాన్, ఇలియానా ముగ్గురు ఓ పార్టీ సాంగ్ లో కలిసి నృత్యించారు. ఆ పాట బాగానే పాపులర్ అయింది కూడా! అయితే ఆ పాట షూటింగ్ నేపథ్యంలో గోవిందా ఈ గోవాబ్యూటీకి బాగానే క్లాస్ పీకాడని ఆమె స్వయంగా తెలుపుతోంది. అయితే అది సీరియస్ విషయం కాదులెండి.. హెల్త్ విషయంలో గోవిందా తనకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఇచ్చారని అమ్మడు తెలుపుతోంది. ఆ వ్యవహారంమీదే మాట్లాడుతూ.. ‘‘గోవిందా ఎంత బాగా డాన్స్ చేస్తారో.. అలాగే ఆరోగ్యం పట్ల అంతే శ్రద్ధతో వుంటారు. ఓసారి ఆయన నన్ను రెడ్ మీట్ తినొద్దని, అది ఆరోగ్యానికి మంచిది కాదని నాకు చెప్పారు. అలాగే నేను ఎంతో ఇష్టంగా తినే పుదీనాను తీసుకోవడం మానేయమని సలహా ఇచ్చారు. అలా హెల్త్ విషయంలో ఆయన మంచి సూచనలు ఇచ్చారు’’ అని అంటోంది ఈ సన్నజాజి నడుము పిల్ల!

అలాగే గోవిందా డాన్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘గోవిందా ఒక అద్భుతమైన డాన్సర్. ‘హ్యాపీ ఎండింగ్’లో ఆయనతో సమానంగా డాన్స్ చేయాలని ప్రయత్నించాను. కానీ నేనంత మంచి డాన్సర్ ను కాదు కదా..! ఓ సన్నివేశానికి స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తూ కొద్దిసేపు రిలాక్స్ అయ్యాను. కానీ మళ్లీ గోవిందా పక్కన చేస్తున్నప్పుడు ఆ అలసట మొత్తం మరిచిపోయాను. ఎందుకంటే ఆయన చాలా నార్మల్, రిలాక్స్ డ్ వ్యక్తి’’ అని ఆయన్ను ఓ పైకే ఎత్తేసిందిలెండి! అయితే ఇదంతా బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు పొందడం కోసమే ఇల్లీ ఇలా సీనియర్ హీరోలతోపాటు చిన్నచిన్న హీరోలను సైతం పొగడ్తలతో ముంచెత్తుతోందని విశ్లేషకుల అభిప్రాయం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ileana dcruz  bollywood hero govinda  happy endings movie  saif ali khan  telugu news  

Other Articles