Samantha interview film industry stardom tollywood

samantha latest news, samantha interview, samantha press meet, samantha hot photo shoot, samantha latest photos, samantha photo gallery, samamtha tollywood movies, samantha telugu movies, samantha kollywood movies, telugu actresses, tollywood actresses, kollywood actresses, telugu news

samantha interview film industry stardom tollywood

ఆ అనుభవాలతోనే స్టార్ హోదా సాధించిందట!

Posted: 11/11/2014 11:06 AM IST
Samantha interview film industry stardom tollywood

చిత్రపరిశ్రమలో వున్న తారలందరూ సాధారణ స్థాయినుంచి స్టార్ హోదాకు చేరుకోవాలంటే ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వుంటుంది. నటనలో తమ ప్రతిభను నిరూపించుకోగలిగితేనే ఆ తర్వాత వారికి అవకాశాలు వరిస్తాయి. అలాగే స్ర్కిప్ట్ కి తగ్గట్టుగా నడుచుకుంటూ కొన్ని హాట్ సన్నివేశాల్లోనూ నటించాల్సి వుంటుంది. ఇలా చెప్పుకుంటూపోతే రకరకాల విభాగాల్లోనూ హీరోయిన్లు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వుంటుంది. అప్పుడే వారు ఆ స్టార్ హోదాను కైవసం చేసుకోగలరు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నవారందరూ ఇప్పటివరకు ఇలా పేర్కొన్నవారే! అయితే కొంతమందికి మాత్రం ఏ సమస్యా లేకుండా అనుకోకుండా అది సొంతం అవుతుంది. ఆ విషయాలను కాస్త పక్కనపెడితే.. తాజాగా సమంత కూడా తాను సాధించిన స్టార్ డమ్ గురించి కొన్ని విషయాలను వ్యక్తపరిచింది.

‘‘ప్రస్తుత నా ప్రయాణం ఓ అందమైన కలలా అనిపిస్తోంది. ఒక్కోసారి ఇదంతా నిజమేనా..? నమ్మాలా..? అని ప్రశ్నించుకుంటుంటాను. షూటింగ్ తొలిరజు ఎంతటి ఉద్వేగానికి లోనయ్యానో నాకు తెలుసు.. ఇప్పటికీ అలాంటి అనుభవాలే నాలో కలుగుతుంటాయి. ప్రతి సినిమా షూటింగ్ లోనూ ఇది మొదటి అనుభవమేనన్న ఆలోచనతో పాల్గొంటాను’’ అని అంటోంది. అమ్మడు. ఈ వ్యవహారంలోనే మాట్లాడుతూ.. ‘‘నటించిన తొలి సినిమానే ఘనవిజయం సాధించడం.. తర్వాత వరుసగా అవకాశాలు రావడం.. అంతా కలలానే వుంది. ఇప్పటికీ ఆ కలలోనే వున్నాననిపిస్తోంది. ఇంతటి గొప్ప వరం నేనెప్పుడూ కోరుకోలేదు కానీ భగవంతుడు ప్రసాదించాడు. అందుకే ఆయనకు రుణపడి వున్నాను’’ అని తనలో వున్న భక్తిని ఇలా ప్రేక్షకులతో పంచుకుంటోంది.

అలాగే ‘‘జీవితంలో అన్నీ సాధించేశానని అనుకోను. కాకపోతే నిన్న వేరు.. రేపు వేరు.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండాలన్న జాగ్రత్త నాకుంది. రేపటిరోజున భవిష్యత్తును ఇంకా బాగుంటుందేమోననే ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకొన్నాను. దాంతోపాటు కొన్ని భయాలూ వుంటాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం నాకుంది. ఒకవేళ అనుకోని కష్టం ఎదురైనా అదీ ఓ కలలానే స్వీకరిస్తాను’’ అని తన కెరీర్ గురించి తన మనసులో వున్న భావాలను వ్యక్తపరుస్తోంది అమ్మడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  tollywood actresses  kollywood news  telugu news  

Other Articles

Today on Telugu Wishesh