Allu arjun trivikram combination movie shooting in hyderabad

allu arjun next movie, allu arjun latest news, allu arjun trivikram movie latest news, tollywood latest news, trivikram next movie, adah sharma next movie updates, nithya menon movie updates

allu arjun trivikram combination movie shooting in hyderabad : allu arjun latest movie with trivikram shooting going in hyderabad in busy roads. allu arjun latest movie shooting in progress in hyderad roads

రోడ్డునపడ్డ స్టైలిష్ స్టార్

Posted: 11/10/2014 01:52 PM IST
Allu arjun trivikram combination movie shooting in hyderabad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా గురించి వేచి చూస్తున్న అభిమానులకు ఓ శుభవార్త. ఆయన తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో షూటింగ్ జరుగుతోందట. బిజీ రోడ్లపై, గల్లీల్లో బన్నీ షూటింగ్ జరుగుతున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. అర్జున్ తో నగరంలోముఖ్య సీన్లు షూట్ చేస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్, హీరోను చూసేందుకు షూటింగ్ స్పాట్ కు వెళ్తున్నారు. నగరంలో బిజీ రోడ్లు, గల్లీలు అంటే బహుశా ఫైట్ సీన్లు లేదా ఇతర టర్నింగ్ పాయింట్ సీన్ల షూటింగ్ అని ఊహించవచ్చు.

ఈ షూటింగ్ పూర్తయితే ఇక ఊటిలో షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. ముందుగానే ఊటి షూటింగ్ జరుగుతుందని అనుకున్నా.., పలు కారణాలతో ఈ షెడ్యూల్ మారినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘జులాయి’ హిట్ తర్వాత వస్తున్న ఈ మూవీలో ముగ్గురు హీరోయన్లు ( సమంత, అదాశర్మ, నిత్య మీనన్) ఉన్నారు. ఈ మూవీని హరిక హాసిని బ్యానర్స్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  trivikram  latest news  tollywood  

Other Articles