Sridevi to play mother character for hansika in her next movie

hansika next movie, hansika tamil telugu movies, sridevi next movie, sridevi daughter heroine, sridevi latest news, vijay next movie, vijay sridevi next movie, tollywood latest news, koliwood latest news

sridevi to play mother character for hansika in her next movie : veteran actress sridevi to play mother role in hansika next movie in a tamil movie. in vijay movie sridevi acting as mother for hansika

మహారాణి మళ్లీ తల్లి అయింది

Posted: 11/07/2014 09:51 PM IST
Sridevi to play mother character for hansika in her next movie

ఎవర్ గ్రీన్ అందాల తారగా పేరుపొందిన శ్రీదేవి వెనక మరోకోణం కూడా దాగి ఉంది. ఈమె అందాల అప్సరసే కాదు.., ఆమ్మగా కూడా అద్బుతంగా నటించగలదు. రీ ఎంట్రీ పేరుతో వచ్చిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ మూవీలో తల్లి పాత్రలో తనదైన నటనను ప్రదర్శించింది. పెళ్లి తర్వాత కుటుంబం, పిల్లలు బాధ్యతలు ఇలా సినిమాలకు దూరం అయిన శ్రీదేవి, మళ్ళీ అదే కుటుంబ కధతో తెరముందుకు వచ్చి అభిమాలను ఆకట్టుకుంది. అందుకే ఆమెకు తల్లి పాత్రలు తెగ వచ్చి పడుతున్నాయి. శ్రీదేవిలో గ్లామర్ హీరోయిన్ తో పాటు తల్లి కోణంను కూడా డైరెక్టర్లు చూసి కాల్షీట్ల కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇక గ్లామర్ గర్ల్ హన్సిక హీరోయిన్ గా వస్తున్న కొత్త తమిళ సినిమాలో శ్రీదేవి నటిస్తోంది. ఇందులో హన్సికకు తల్లి పాత్రలో అలనాటి అందాల తార నటిస్తోందని కోలివుడ్ వర్గాలు చెప్తున్నాయి. హన్సిక రాకుమారి పాత్రలో మెరిసిపోయేందుకు సిద్ధమవుతుండగా.., ఆమె తల్లిగా మహారాణి పాత్రలో దేవి కన్పించనుంది. ఇక సోషియో ఫాంటసిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరో విజయ్ నటిస్తున్నాడు. అంటే విజ్జికి శ్రీదేవి అత్త అవుతుందన్నమాట. అయితే సినిమా కథ ఏమిటో తెలిస్తే.., రిలేషన్ పై క్లారిటీ వస్తుంది. అప్పటివరకు మాత్రం శ్రీదేవి అత్త అని ఫిక్స్ కావటమే.

‘కత్తి’ సూపర్ హిట్ తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా ఇది. భారీ బడ్జెట్, అంచనాలతో తెరకెక్కుతుందని తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా కోసం చెన్నై బీచ్ రోడ్డులో దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో రాజసౌధంను పోలి ఉండే భారీ సెట్ వేశారు. ఇందులోనే ఎక్కువ భాగం సీన్లు షూట్ చేస్తారని చెప్తున్నారు. మరొక విషయం ఏమిటంటే ఈ మూవీలో శృతి హాసన్ కూడా నటిస్తోంది. ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ అట. మరి విజయ్ సినిమాలో శృతి వెంట పడతాడా.. లేక యువరాణిని  కోరుకుంటాడా తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sridevi  hansika  vijay  latest news  

Other Articles