Katrina kaif and ranbir kapoor to leave to gether in their new home in mumbai

ranbir kapoor dating katrina kaif, ranbir katrina love, ranbir katrina new home, ranbir katrina dating, katrina next movie, ranir next movie, bollywood latest news, tollywood latest news, dating heros of bollywood

katrina kaif and ranbir kapoor to leave to gether in their new home in mumbai : bollywood heroine katrina kaif and ranbir kapoor love become strong, both decides to leave in a home that means leaving to gether. in mumbai a katrina ranbir takes a home and shifting to november 8th

పెళ్లి కాకుండానే కొత్త కాపురం పెట్టారు

Posted: 11/07/2014 05:22 PM IST
Katrina kaif and ranbir kapoor to leave to gether in their new home in mumbai

బాలీవుడ్ లో సుదీర్ఘ ప్రేమాయణం సాగిస్తున్న బాలీవుడ్ తారలు రణ్బీర్ కపూర్, కత్రినా ఖైఫ్ ఓ ఇంటివారవుతున్నారు. చెప్పకుండా పెళ్లేమిటి అని ఆశ్చర్యపోకండి. బాలీవుడ్ లో ఓ కల్చర్ అంటూ ఉందిగా. ముందు ప్రేమ, ఆ తర్వాత డేటింగ్ అన్ని కుదిరితే పెళ్లి. కాబట్టి ఇప్పుడు వీరిద్దరూ రెండవ భాగంలోకి మళ్లీ అడుగు పెడుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ఉంటుండగా.., మరో కొత్త ఇంట్లోకి మారేందుకు సామాన్లు సర్దేసుకున్నారట. శనివారం (నవంబర్8) ముహూర్తం బాగుందని అన్నీ చూసుకుని కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నారని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.

ముంబై కార్టర్ రోడ్ లో అన్ని వసతులతో కొనుక్కున్న లగ్జరీ ఇంట్లోకి వీరు మారుతున్నారు. ఎంతో ఇష్టపడి తమ ప్రేమకు గుర్తుగా కొనుక్కున్న ఈ ఇంట్లో.., ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ ఆశీష్ తో డిజైన్ చేయించారు. సహజీవనం చేసి ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారని సన్నిహితులు చెప్తున్నారు. ఇక వీరి ప్రేమకు ఇద్దరి కుటుంబాలు అంగీకరించాయి. ముందు రణ్బీర్ తండ్రి కాస్త బెట్టుచేసినా ఆ తర్వాత కొడుకు కోసం తగ్గాడు. దీంతో ఒకరినొకరు అర్ధం చేసుకునేందుకు డేటింగ్ ఉపయోగపడుతుందని ఇలా కలిసి జీవిస్తున్నారట. అర్ధం చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ.., అపార్ధం చేసుకుంటేనే కలల సౌధం ఖాళీ అవుతుంది. చూడాలి మరి వీరి ప్రేమాయణం కూడా మిగతావారి లాగే..మూణ్ణాళ్ళ ముచ్చటగా ఉంటుందా, లేక మూడు ముళ్ళు దాటుకుని ముందుకు వెళ్తుందా..?

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ranbir kapoor  katrina kaif  dating  latest news  

Other Articles