Taapsee pannu angry on rapists

taapsee pannu latest comments, taapsee pannu next movie, taapsee pannu comments on rapists, tollywood latest news, rapes in india, rape cases list, crimes in india, indian constitution

taapsee pannu angry on rapists : actress taapsee pannu become impatient on rapists says that rapists must punished seviourly. rapists must punished by fasttrack courts to avoid this in future says taapsee pannu

అలాంటి వాళ్ళను ఏం చేసినా తప్పు లేదు

Posted: 11/04/2014 04:46 PM IST
Taapsee pannu angry on rapists

సినిమా హీరోయిన్లకు నటనతో పాటు సామాజిక బాధ్యతలు కూడా ఉన్నాయని సొట్ట బుగ్గల సుందరి తాప్సి చెప్తోంది. సమాజంలో నిత్యం జరిగే విషయాలను తాము కూడా పరిశీలిస్తుంటామని చెప్పింది. దేశంలో రోజూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పట్ల తాప్సి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై మాట్లడిన ఆమె., నిత్యం మన దేశంలో ఏదో ఒక ప్రాంతంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులపై కూడా రేప్ లు జరుగుతున్నాయి. వీటిని వెంటనే అరికట్టాలని పేర్కొంది.

అంతేకాకుండా ఇలాంటి దారుణాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు వెంటనే శిక్ష పడితే భవిష్యత్తులో తప్పుచేయాలనే ఆలోచన ఎవరికీ రాదని తెలిపింది. జాప్యం జరిగితే ఇతరులకు అలుసుగా, ఇదో అవకాశంగా మారుతుందని చెప్పింది. సత్వరమే శిక్ష పడితే దారుణాలు తగ్గించవచ్చని వెల్లడించింది. తాప్సి కోరుకున్న మార్పు వస్తుందో.. రాదో వేచి చూద్దాం.

‘ఝుమ్మంది నాదం’తో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ పన్ను మహిళల ప్రస్తుతం హిందీ సినిమాల ప్రభావంతో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉంటోంది. బాలీవుడ్ లొ క్షణం తీరిక లేకపోవటంతో టాలీవుడ్ వైపు చూసే అవకాశం ఉండటం లేదట. అయితే సరైన అవకాశం వస్తే మాత్రం తెలుగులో ఖచ్చితంగా సినిమా చేస్తాను అని చెప్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : taapsee pannu  rapists  latest news  tollywood  

Other Articles