Rambabu acting as hero in puliraja telugu movie

telugu latest movies, tollywood 2014 movies, rambabu artist, comedian rambabau, rambabau in puliraja movie, puluraja movie cast and crew, tollywood latest news

rambabu acting as hero in puliraja telugu movie : character artist rambabu acting as hero in puliraja movie. rambabu playing ips officer role in puliraja movie who is not even four feets hight

మూడు అడుగుల బుల్లెట్టు దూసుకొస్తున్నాడు

Posted: 11/04/2014 05:57 PM IST
Rambabu acting as hero in puliraja telugu movie

ఎంతో మంది కళాకారులను స్టార్లను చేసింది తెలుగు పరిశ్రమ. ఏమి లేకుండా వచ్చిన వారు కూడా ఇండస్ర్టీ పుణ్యమా అని అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. తంతే బూరెల గంపలో పడినట్లుగా.., క్యారెక్టర్ ఆర్టిస్టు, కమెడియన్ రాంబాబు (పొట్టి రాంబాబు) హీరో అయిపోయాడు. బాలాదిత్య హీరోగా వచ్చిన ‘చంటిగాడు’లో ఓసేయ్ రాములమ్మ అంటూ కామెడి చేసిన పొట్టి బాబు ఇప్పుడు ఏకంగా సినిమా హీరో అయ్యాడు. ‘పులిరాజా’ అనే కామెడి మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో రాంబాబు హీరోగా కన్పించనున్నాడు. నాలుగు అడుగులు కూడా డౌటుగా ఉండే ఈయన ఐపీఎస్ ఏమిటి అనుకుంటున్నారా.. కామెడి కదా అలాగే ఉంటుంది అని చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నీహా సైరాగోషైన్ అనే ముంబై భామ నటిస్తోంది. పోలిస్ ఆఫీసర్ గా ఎలా డ్యూటీ చేస్తాడు.. ఇదే సమయంలో హీరోయిన్ ను ఏ విధంగా మెప్పించి ప్రేమలో పడేస్తాడు అనేది సినిమా కధ అని ‘పులిరాజా’ యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.

ఇక ఈ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన కమెడియన్ అలీ.., పవన్ ఆరు అడుగుల బుల్లెట్ అయితే.., రాంబాబు మూడు అడుగుల బుల్లెట్ అని కితాబిచ్చారు. ఇక మూవీ గురించి మరింత వివరాలు చూస్తే.. రాఘవ తిరువాయిపాటి అనే కొత్త డైరెక్టర్ ‘పులిరాజా’ను తెరకెక్కిస్తున్నాడు. రాంబాబు తండ్రి పాత్రలో ఎం.ఎస్. నారాయణ నటిస్తున్నాడు. అదేవిధంగా బ్రహ్మానందం కూడా మూవీలో కీ రోల్ చేస్తున్నాడట. కామెడి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పు పొందిన రాంబాబు హీరోగా ఏం చేస్తాడో చూడాలి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rambabu  puliraja  latest news  tollywood  

Other Articles