Karthikeya movie collections increased on second week and also theatres figures increased in other centers

karthikeya movie, colors swathi, swathi reddy, hero nikhil, director chandu mondeti, karthikeya movie collections, karthikeya movie theatres, karthikeya movie tollywood, tollywood news, small budget movies tollywood, karthikeya movie crew members, hero nikhil interview, hero nikhil swathi, colors swathi hot photos, colors swathi reddy interview

karthikeya movie collections increased on second week and also theatres figures increased in other centers

ఇండస్ట్రీలో బడాబాబులకు షాకిచ్చిన కార్తికేయ!

Posted: 11/03/2014 05:56 PM IST
Karthikeya movie collections increased on second week and also theatres figures increased in other centers

ఇటీవలే టాలీవుడ్ ఇంటస్ట్రీలో భారీ బడ్టెట్ తో పెద్దసినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర చాలావరకు బోల్తాపడుతుంటే.. చిన్నసినిమాలు మాత్రం సక్సెస్ ఫుల్ గా విజయం సాధిస్తూ మంచి వసూళ్లను రాబడుతున్నాయి. అయితే వీటన్నిటికంటే భిన్నంగా ‘‘కార్తికేయ’’ తెలుగుచిత్రపరిశ్రమలో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నట్లు కనిపిస్తోంది. విమర్శకుల సైతం ప్రశంసలందుకుని మంచి విజయంతో దూసుకుపోతున్న ఈ మూవీ... భారీ కలెక్షన్లతోపాటు మరో అరుదైన రికార్డును సృష్టించింది. పెద్ద హీరో వుంటేనే సినిమాకు భారీ కలెక్షన్లు వస్తాయి.. ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు బద్దలవుతాయనే మాటలకు ఈ చిన్న సినిమా బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.

హీరో నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన ‘‘కార్తికేయ’’ చిత్రానికి దర్శకుడు చందూమొండేటి టాలీవుడ్ కు పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 10కోట్ల రూపాయలవరకు కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గా అంచనా! అంతేకాదు.. ఏ విధంగా అయితే మొదటివారాంతంలో ఈ మూవీ కలెక్షన్లను సాదించిందో.. అదేవిధంగా రెండోవారంలో కూడా భారీ కలెక్షన్లను సాధిస్తోందని.. అన్ని సెంటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయని సమాచారం. నిజానికి ప్రస్తుత ట్రేడ్ వర్గాల లెక్కలప్రకారం ఎంత స్టార్ హీరో సినిమా అయినా బాక్సాఫీస్ దగ్గర కేవలం తొలి వీకేండ్ లోనే భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి. ఆ తర్వాత రెండోవారంలో అమాంతంగా తగ్గిపోతున్నాయి. అలాగే థియేటర్ల స్థాయి కూడా పూర్తిగా పడిపోతాయి.

కానీ కార్తికేయ మాత్రం అలాకాకుండా టాలీవుడ్ రూల్స్ బ్రేక్స్ చేస్తూ రెండోవారంలోనూ హౌస్ ఫుల్ గా నడుస్తోందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మొదట్లో కేవలం 350 థియేటర్లలో మాత్రం విడుదలై బంపర్ కలెక్షన్లను రాబట్టిన ఈ మూవీకు యూనివర్శల్ అప్లాజ్ రావడంతో రెండోవారం మరో 50 థియేటర్లను పెంచడం విశేషంగా మారింది. మొన్న ‘‘కరెంట్ తీగ’’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేసినప్పటికీ.. డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర డీలా అయిపోయింది. కానీ ‘‘కార్తికేయ’’ మాత్రం ముందున్న ఊపుతోనే కలెక్షన్లతో దూసుకుపోతోందని లెక్కలు చెబుతున్నాయి.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ముందుగా కార్తికేయ సినిమాను రోజుకు మూడు షోలు వేశారని... తర్వాత హిట్ టాక్ రావడతో 5కు పెరిగిందని.. ప్రస్తుతం రెండో వీకెండ్ లో పది షోలు నడుస్తోందని హీరో నిఖిల్ కూడా ట్వీట్ చేశాడు. తమిళ వెర్షన్ రిలీజ్ గురించి చెన్నై నుంచి చాలామంది సంప్రదిస్తున్నారని.. అయితే అందుకోసం మంచి డేట్ కోసం ఎదురుచూస్తున్నామని నిఖిల్ పేర్కొన్నాడు. ఏదేమైనా.. ఈ సినిమా ప్రభంజనం మాత్రం టాలీవుడ్ లో బడాబాబులకు పెద్ద షాక్ కే గురిచేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే 20 కోట్లపైనే ఎక్కువ కలెక్షన్లను వస్తాయని ట్రేడ్ వర్గాల అంచనా! అన్నట్లు నిఖిల్ కూడా తన రెమ్యునరేషన్ కోటి రూపాయలకు పెంచినట్లు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles