Rajnikanth linga movie first look teaser released

rajnikanth, rajnikanth latest news, rajnikanth linga movie, linga movie news, linga movie teaser, linga movie first look teaser, linga movie trailer, sonakshi sinha, ks ravikumar, anushka shetty

rajnikanth linga movie first look teaser released

చూడండి : టాప్ లేపిన రజనీ ‘‘లింగా’’ ట్రైలర్!

Posted: 11/01/2014 05:13 PM IST
Rajnikanth linga movie first look teaser released

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘‘లింగా’’ మూవీలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే! కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీ ద్విపాత్రాభినయంలో అలరించనున్నారు. ఆయన సరసన హీరోయిన్లుగా సోనాక్షి సిన్హా, అనుష్కలు నటిస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభించింది. 63ఏళ్ల వయస్కుడైన రజనీకాంత్ ఈ సినిమాలో 25ఏళ్ల యంగ్ హీరోలా కనిపిస్తున్నాడంటూ కితాబిచ్చారు కూడా!

ఇదిలావుండగా.. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్ సరికొత్త లుక్ లో కనువిందు చేస్తూ.. భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. అలాగే హీరోయిన్లుగా నటిస్తున్న అనుష్క, సోనాక్షీలు ఎంతో గ్లామరస్ గా కనిపించారు. భారీ బడ్జెత్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో రజనీకాంత్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు ఖాయమంటూ అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajnikanth  linga movie  sonakshi sinha  ks ravikumar  anushka shetty  

Other Articles