Action jackson is remake of mahesh babu dookudu movie

prabhudeva upcoming movie, ajay devagan upcoming movie, action jackson movie updates, action jackson photos dookudu in bollywood, dookudu bollywood remake, mahesh babu upcoming movie, tollywood latest news, bollywood latest news

action jackson is remake of mahesh babu dookudu movie : prabhudeva directing latest movie action jackson is remake of mahesh babu super hit movie dookudu. earlier also prabhudeva made some remake movies and got success

బాలీవుడ్ లో మహేష్ ‘యాక్షన్’ దూకుడు

Posted: 10/24/2014 05:41 PM IST
Action jackson is remake of mahesh babu dookudu movie

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులోనే కాదు... బాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు కొన్ని అక్కడ కూడా విడుదల అయ్యాయి. ఆ కోవలోనే మహేష్ సూపర్ హిట్ ‘దూకుడు’ను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారట. రీమేక్ సినిమాలు చేసి సక్సెస్ కొడుతున్న డైరెక్టర్ ప్రభుదేవా హిందీలో ఈ ప్రాజెక్టు చేపట్టారు అని తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రస్తుతం చేస్తున్న ‘యాక్షన్ జాక్సన్’ సినిమా ‘దూకుడు’ రీమేక్ అని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.

గతంలో పోలిస్ క్యారెక్టర్ సినిమాలు చేసిన అజయ్ దేవగన్ ప్రస్తుతం ఈ కామెడి, యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం బాగానే కష్టపడుతున్నాడు అని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. హీరోయిజం, అందులోనే కామెడిని చూపించటం అంటే కొంచెం కష్టం. అయినా సరే మహేష్ చేసిన విధానం చూసి అజయ్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇక గతంలో మహేష్ ‘పోకిరి’తో బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవా.. ఈ ప్రాజెక్టు కూడా క్లిక్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే బాలీవుడ్ ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువగా ఇసష్టం కాబట్టి.., ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ బంపర్ హిట్ కావటం ఖాయం అంటున్నారు.

మొదట్లో యాక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా ఉన్న ప్రభుదేవా ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు. రీమేక్ సినిమాలు చేసి బాగానే హిట్ కొట్టారు. అదే ఊపుతో సొంతంగా తమిళం, హిందీలో రెండు కధలతో సినిమాలు చేసి ఘోరంగా దెబ్బతిన్నాడు. దీంతో తనకు రీమేక్ అయితేనే సూట్ అవుతుంది అని మళ్ళీ వాటిపై పడ్డాడు. రీమేక్ రాజాగా పేరున్న ప్రభుకి ‘దూకుడు’తో మరో హిట్ పడినట్లే అని చెప్పాలి.


కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhudeva  action jackson  ajay devagan  mahesh babu  

Other Articles