Dhanush comments on vijay kaththi movie

vijay kaththi movie, kaththi latest news, kaththi latest photos, kaththi review, vijay on kaththi movie, vijay next movie, dhanush on kaththi movie, kaththi movie torrent files, koliwood latest upates, dhanush next movie

dhanush comments on vijay kaththi movie : tamil hero vijay kaththi movie released hero dhanush watched film and comments on the project. dhanush says kaththi movie was awesome and it doing well also says congratulations to the movie unit

‘కత్తి’ సినిమాపై ధనుష్ కామెంట్

Posted: 10/24/2014 10:33 AM IST
Dhanush comments on vijay kaththi movie

విజయ్ తాజా చిత్రం ‘కత్తి’పై తమిళ స్టార్ హీరో ధనుష్ కామెంట్ చేశాడు. సినిమా చూసిన రజిని అల్లుడు..., కత్తి కేక అని చెప్పాడు. సినిమా నిజంగా చాలా బాగుంది అని ధనుష్ వెల్లడించారు. మూవీపై ట్విట్టర్ లో కామెంట్ చేసిన ధనుష్ ‘ కత్తి సినిమా చాలా బాగుంది. క్వాలిటీ పరంగా కూడా సూపర్ గా ఉంది. విజయ్, ఎ.ఆర్.ఎమ్. మరియు అనిరుధ్ కు అభినందనలు’ అని ట్విట్ఱర్ లో పోస్ట్ చేశాడు. హీరోలిద్దరూ ఒకరి సినిమాలపై మరొకరు కామెంట్ చేసుకోవటం కొత్తేమి కాదనకొండి. అయితే వివాదాలకు కారణం అయిన తాజా సినిమాపై ధనుష్ ఏం చెప్తాడా అని అంతా ఎదురుచూశారు. చివరకు సినిమాకు గ్రీన్ సిగ్నల్ రావటంతో పాజిటివ్ గా స్పందించాడు.

తమిళంలో విడుదలకు ముందు ఎన్నో వివాదాలు, ఉద్రిక్తతలకు ‘కత్తి’కారణం అయిందన్న విషయం తెలిసిందే. ఆందోళనల కారణంగా సినిమా ప్రదర్శించేందుకు కూడా థియేటర్లు ముందుకు రాలేదు. చివరకు లైకా బ్యానర్ పేరు సినిమా నుంచి తొలగించేందుకు ఒప్పుకోవటంతో సినిమా విడుదల అయింది. దీపావళి కానుకగా భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ లో మంచి టాక్ అందుకుంది. ఇక తెలుగులో కూడా విడుదల అయ్యేందుకు సిద్ధం అయింది. అక్టోబర్ 31న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ విడుదల కానుంది.

అటు ధనుష్ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు. రజినీకాంత్ ‘లింగా’ విడుదల అయ్యాక ఈ సినిమా విడుదల కానుంది. ఈ మద్యే ఓ కన్నడ సినిమాలో ధనుష్ పాట కూడా పాడాడు. ఇందుకు ఆయనకు ఖరీదైన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడని టాక్ వస్తోంది.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijay  kaththi  dhanush  latest news  

Other Articles