Bollywood stars plays cards on diwali as a custom

amitabh bachan next movie, amitabh bachan playing cards, bollywood heros playing cards, bollywood heroines playing cards, playing cards on diwali, tollywood latest news, bollywood latest news, diwali celebrations in india, diwali celebrations in andhrapradesh

bollywood stars plays cards on diwali as a custom : all bollywood star heros and heroines played cards on diwali. it is a custom in one part of the country to play cards on diwali amitabh bachan, akshay kumar, shilpashetty and other stars participated in the game

బాలీవుడ్ లో పేకాట పోటీలట... దీపావళి లక్ష్మి ఎవరి సొంతమో... ?

Posted: 10/24/2014 12:24 PM IST
Bollywood stars plays cards on diwali as a custom

పండగ వచ్చిందంటే చాలు అందరూ సరదాగా.., సంతోషంగా గడిపేందుకు సిద్ధం అవుతారు. ఇందుకు చిన్నా, పెద్దా., ధనిక, పేద అనే తేడా లేదు. ఎవరికి ఉన్నంతలో.., ఎవరి ఆచార సాంప్రదాయాల ప్రకారం వారు పండగలు జరుపుకుంటారు. ఇందుకు బాలీవుడ్, టాలీవుడ్ సినిమా తారలు కూడా అతీతం కాదు. ముఖ్యంగా దీపావళి పండగ వచ్చిందంటే చాలు.., బాలీవుడ్ లో పేకాట సందడి కన్పిస్తుంది. మన దగ్గర సంక్రాంతికి కోడి పందాలు ఎలాగో.., దీపావళికి ఉత్తరాన పేకాట అలాగన్నమాట. బాలీవుడ్ తారలంతా ఒక్కచోట చేరి పేకాట ఆడుతూ సరదాగా గడపటం ఎప్పట్నుంచో వస్తున్న సాంప్రదాయం.

లక్షల రూపాయలు చేతులు మారే ఈ పట్టా పార్టీ (పేకాట) కోసం బాలీవుడ్ తారలంతా ఆసక్తి చూపారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే..., మనందరికి మంచి మనిషి, నటుడు, సమాజం పట్ల బాధ్యత కల వ్యక్తిగా తెలిసిన అమీర్ ఖాన్ తన ఇంటిని ఇందుకోసం వేదికగా మార్చేశాడు. బాంద్రాలోని తన ఇంటిలో పెద్దపెద్ద టేబుల్లు వేయించి రండి పేకాడుకుందాం అని అందర్నీ ఆహ్వానించాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.., అమీర్ ఇల్లు అయిన బాంధ్రాలోని యునియన్ పార్క్ రెసిడెన్స్ లో బాలీవుడ్ స్టార్లు ఫ్లష్, రమ్మీ, పోకర్ వంటి ఆటల్లో పాయింట్లకు రూ.5 నుంచి రూ.5000 వేల వరకు పెట్టారట. బయట ‘సత్యమేవ జయతే’ అంటూ సమాజాన్ని మేల్కొలిపే కార్యక్రమాలు చేస్తూ ఇలా పేకాటను ప్రోత్సహించటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

పేకాట కోసం అగ్రతారలు రణ్ బీర్ కపూర్, హృతిక్ రోషన్, దీపికా పడుకునే, ప్రియాంకా ఛోప్రా తో పాటు రాజ్ కుమార్ హిరాని, కరన్ జోహర్, రాఖేష్, ఓం ప్రకాష్ చౌతాలా తదితరులను ఆహ్వానిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక పేకాట ఆడటతో జితేంద్ర ఆరితేరాడట. ఎప్పుడూ ఆటను ఆయనే రూల్ చేస్తాడు అని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ పేకాట పెద్దన్న అతిధుల కోసం తన ఇంట్లో ఏకంగా రెండు ఫ్లోర్లలో టెబుళ్లను పరిచాడట. ఇది చూడటానికి అట్లాంటా కాసినోలా ఉంటుందని సన్నిహితులు అంటున్నారు.
 
దీపావళికి పేకాట ఆడటంలో ఎవరూ తక్కువ తీసిపోరు. తనకు ఈ పండగకు పేకాట ఆడటం అంటే ఎంతో ఇష్టమని ఫేమస్ డైరెక్టర్ కరన్ జోహర్ చెప్తున్నారు. ఇక బాలీవుడ్ సీనియర్ అందాల భామ శిల్పా శెట్టి కూడా ఈ సాంప్రదాయాన్ని గౌరవిచటంతో పాటు పాటిస్తానని గర్వంగా చెప్పుకుంటోంది. ఇక తన భర్త, మిలినియర్ అయిన రాజ్ కుంద్రా పేకాటలో దిట్ట అట. పోకర్ లో ఆయనంత పోటుగాడెవరూ ఉండరూ అని ఢంకా భజాయిస్తోందీ అమ్మడు. తనకు పోకర్ ను కుంద్రాయే ఓపిగ్గా నేర్పాడట. ఇక బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ఇంట్లో జరిగే ఈ ఆట గురించి అంతా గొప్పగా చెప్పుకుంటన్నారు. దీపావళి వచ్చిందంటే చాలు ఫుల్ టు పేకాట మూడ్ లోకి వచ్చేస్తాడట.

ఇలా ప్రతి ఒక్కరూ దీపావళికి పేకాట ఆడుకోవటంలో బిజీగా ఉన్నారు. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. వీరంతా సెలబ్రిటీలు, లక్షల సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్న వ్యక్తులు. వీరు చేసే ప్రతి కామెంట్, అనుసరించే వైఖరి అభిమానులపై ప్రతిబింబిచటం ఖాయం. అలాంటి వ్యక్తులు ఇలా పండగ పేరుతో పేకాట ఆడుతుంటే., సామన్యులు కూడా వీరిని అనుసరించరా.? వీరికి లక్షలు పోతే పెద్ద లెక్క కాకపోవచ్చు. కాని సామాన్యులకు వంద రూపాయలు నష్టపోయినా అది వారికి నష్టం అనే చెప్పాలి. కాబట్టి ఫ్యాన్స్ పై బాద్యత కల వ్యక్తులుగా ఇలా చేయటం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి. పేకాటకు బదులు కొత్తగా అందరికి ఉపయోగపడే సాంప్రదాయినికి ఈ పండగ పూట తెరతీయవచ్చు కదా. ఒక్కసారి ఆలోచించండి అగ్రతారలారా...

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : diwali  playing cards  bollywood  latest news  

Other Articles