Allari naresh brother of bommali movie satellite rights sold to zee telugu

brother of bommali release date, brother of bommali movie, allari naresh next movie, karthika movies, karthika next movie, monal gajjar movies, tollywood latest updates, zee telugu programmes, telugu tv channel programmes, latest telugu updates

allari naresh brother of bommali movie satellite rights sold to zee : comedy hero allari naresh latest movie brother of bommali sold out to zee telugu for a fancy amount of 4crores

బొమ్మాళిని టీవికి అమ్మేశారు

Posted: 10/17/2014 02:47 PM IST
Allari naresh brother of bommali movie satellite rights sold to zee telugu

కామెడి సినిమా లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అల్లరి నరేష్ కొత్త సినిమా ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ శాటిలైట్ హక్కులు అమ్మేశారు. బుల్లితెర ప్రముఖ సంస్థ ఎంటర్ టైన్ మెంట్ జీ తెలుగు ఈ మూవీ హక్కలను తీసుకుంది. ఇందుకోసం జీ యాజమాన్యం రూ.4కోట్ల రూపాయలు చెల్లించిందని టాలీవుడ్ టాక్. అల్లరి నరేష్ సినిమాకు ఈ స్థాయిలో రావటం ప్రేక్షకుల్లో ఆయనకున్న క్రేజ్ ను తెలియజేస్తుంది. ఆడియో విడుదలై హిట్ టాక్ పొందింది. దీంతో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

‘పెళ్ళయింది కాని’ సినిమా తర్వాత అమాయకుడి పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్న సినిమా ఇది. ఇందులో నరేష్ సోదరిగా కార్తీక చాలా బాగా చేసిందని అంటున్నారు. గత సినిమాల్లో గ్లామర్ పాత్రలకు పరిమితమైన ఈ అమ్మడు.., అల్లరి నరేష్ కోసం ఫైట్లు చేసిందట. అదీ డూప్ లేకుండా అని అంతా చర్చించుకుంటున్నారు. ఈ ఫైట్లే సినిమాకు హైలైట్ అని చెప్తున్నారు.

‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాకు చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.., అమ్మిరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శేఖర్ చంద్ర పాటలకు మంచి స్పందన వస్తుంది. వెరైటీ ప్రోమోలు, ట్రైలర్ లతో కామెడి ప్రేక్షకులు, అభిమానుల్లో ఈ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెంచుతున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : brother of bommali  allari naresh  karthika  zee telugu  

Other Articles