Allu arjun latest movie shooting in ooty

allu arjun latest movies, allu arjun trivikram movie, trivikram latest movies, telugu upcoming movies, trivikram srinivas movies, allu arjun with pranitha, allu arjun adah sharma movies, samantha allu ajrun movies, telugu latest updates

allu arjun movie shooting in ooty : stylish star allu arjun latest movie going shoot in ooty after 25th october bunny, trivikram and three heroines may also going to ooty

దీపావళి తర్వాత చలికాచుకుంటాడేమో

Posted: 10/15/2014 03:49 PM IST
Allu arjun latest movie shooting in ooty

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్లతో బన్నీ కధ పూర్తి చేశాడు. అటు ఈ సినిమా షూటింగ్ త్వరలో ఊటిలో జరుగుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కొన్ని పాటలు ఇతర సన్నివేశాల కోసం దీపావళి తర్వాత ఊటికి వెళ్తారని తెలుస్తోంది.

ఇప్పటికే సమంత, అదాశర్మలు షూటింగ్లో పాల్గొనగా మిగిలిన మూడవ హీరోయిన్ ప్రణీత ఊటి షూట్ లో కన్పిస్తుందని తెలుస్తోంది. తమిళనాట కీలక సన్నివేశాల షూటింగ్ లో నటి స్నేహ, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా పాల్గొంటారని ఫిలింనగర్ టాక్. వీరిద్దరూ ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఊటి షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చి చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి.

‘జులాయి’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. కె.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా ప్రాజెక్టుకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముగ్గురు హీరోయిన్లతో బన్నీ స్టెప్టుల గురించి గుసగుసలు కూడా విన్పిస్తున్నాయి. ఇవన్నీ త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  trivikram srinivas  samantha  latest updates  

Other Articles