Vv vinayak on his new projects

vv vinayak, vv vinayak movies, vv vinayak comments, vv vinayak chiranjeevi movies, vv vinayak stories, vv vinayak movies list, vv vinayak family, vv vinayak caste, vv vinayak latest news, chiranjeevi, chiranjeevi 150 movie, chiranjeevi latest news, chiranjeevi gossips, chiranjeevi daughter marriage, chiranjeevi first daughter marriage, chiranjeevi udaykiran issue, latest news, movie news, mahesh babu, mahesh babu movies, mahesh babu family, mahesh babu latest movies, mahesh babu upcoming movies, mahesh babu aagadu movie, aagadu movie review, aagadu movie latest updates

director vv vinayak commented on his new projects in his birthday special interview to a newsdaily paper : currently all projects on script leval only soon i will announce about my movies says vv vinayak

అన్నీ కథలు చెప్తున్నాడు

Posted: 10/09/2014 12:21 PM IST
Vv vinayak on his new projects

సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వీవీ వినాయక్ ఈ మద్య సినిమాలు తీయటం తగ్గించారు. కొద్దికాలం గ్యాప్ తీసుకుని బెల్లంకొండ ఫ్యామిలి కోసం ‘అల్లుడు శీను’ అంటూ మళ్లీ బయటకు వచ్చారు. అది బెడిసొకొట్టడంతో మళ్లీ సైలెంట్ అవుతాడు అనుకున్నారంతా. కానీ అపజయాలే విజయానికి మెట్లు అన్నట్లుగా.., ఒక సినిమా పోతే మరొక సినిమా తీసి చూపించాలి అనుకున్నాడు. అందుకే ఏకంగా చిరంజీవి సినిమాను టార్గెట్ చేశాడు. గతంలో మెగాస్టార్ తో పలు హిట్ సినిమాలు చేసిన క్రెడిట్ ఉండటంతో.., అదే పేరును వాడుకుని 150 సినిమా చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

చిరంజీవి 150వ సినిమా గురించి బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. వి.వి.కి ముందే చాలామంది పెద్ద డైరెక్టర్లు కధలను సిద్దం చేసుకున్నారు. కొందరు విన్పించే ప్రయత్నంలో విఫలం అవ్వగా.., మరికొందరు కధ విన్నాక వెనక్కివెళ్లిపోయారు. అయితే వీవీ వినాయక్ విషయంలో ఏం జరుగుతుందో మాత్రం బయటకు రాలేదు. కధ సిద్ధం అయిందా..? విన్పించారా..? లేదా..? అనే ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. వీటన్నిటికి సమాధానంగా ప్రస్తుతం కధపై చర్చలు జరుగుతున్నాయి అని కాస్త క్లారిటి ఇచ్చాడు. అయితే కధ ఏమిటి అనేది మాత్రం చెప్పలేదు.

ఇక చిరు సినిమాకు ముందే అఖిల్ తొలి సినిమాపై వారం రోజుల్లో క్లారిటి వస్తుందని చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు కూడా కధ విన్పించే పనిలో పనిలో ఉన్నాడట. అక్కనేని వారసుడి తొలి సినిమా చేయాలని తెగ ఆరాటపడుతున్నాడు. కధ  ఓకే అయితే సెట్స్ పైకి వెళ్లటమే మిగిలింది అంటున్నాడు. ఈ సినిమాతో పాటు మహేష్ తో చేయబోయే కొత్త సినిమాకు కూడా కధ దశలోనే ఉంది అంటున్నాడు. ఈ మూడు కధలు ఎటు వెళతాయో ఇంకా తెలియదు. ఇక విశేషం ఏమిటంటే ఇవాళ వి.వి. వినాయక్ పుట్టినరోజు. ‘తెలుగు విశేష్’ తరపున విష్ యు ఎ వెరి హ్యాపిబర్త్ డే వి.వి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vv vinayak  mahesh babu  chiranjeevi  latest news  

Other Articles