Preity zinta pulled out a boy from theatre

preity zinta, preity zinta hot, preity zinta latest, preity zinta news, preity zinta angry, preity zinta twitter, preity zinta facebook, preity zinta ness wadia affair, preity zinta ness wadia case, preity zinta wadia issue, preity zinta latest hot photos, preity zinta movies, preity zinta latest movies, bang bang movie, bang bang movie collections, bang bang movie latest updates, bang bang movie review, tollywood, bollywood, latest news, national anthem

preity zinta pulled out a boy from theatre for not standing when national anthem coming in the movie : some of netizens angry on priety zinta for pulling out a boy from theatre

లేవటంలేదని అబ్బాయిని తోసేసిందిట

Posted: 10/08/2014 12:33 PM IST
Preity zinta pulled out a boy from theatre

నటి ప్రీతిజింటా ఈ మద్య సినిమాల్లో కంటే వార్తల్లో ఎక్కువగా కన్పిస్తుంది. కొన్నాళ్ళుగా నెస్ వాడియాతో వివాదాల వార్తలతో ప్రచారంలో ఉన్న ప్రీతి.., ఇఫ్పుడో అబ్బాయిని తోసేసి మళ్ళీ మీడియాలో ముచ్చటగా మారింది. విషయానికి వస్తే.., హృతిక్ రోషన్ కొత్త సినిమా ‘బ్యాంగ్ బ్యాంగ్’ చూసేందుకు ప్రీతి మంగళవారం సినిమా థియేటర్ కు వెళ్ళింది. సినిమా మొదలయ్యే ముందుగా జాతీయగీతం ‘జనగణమణ’ వస్తుండగా., ఓ అబ్బాయి లేచి నిలబడలేదు. దీంతో ప్రీతికి చిర్రెత్తుకొచ్చింది. కోపం పట్టలేకపోయింది. జాతీయ గీతం వస్తుంటే లేవకుండా ఉంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతటితో ఊరుకోకుండా.., అబ్బాయిని సినిమా థియేటర్ బయటకు బలవంతంగా పంపించివేసింది. జాతీయ గీతాన్ని గౌరవించలేని వ్యక్తి సినిమా చూడవద్దు అంటూ పెద్ద సీన్ క్రియేట్ చేసిందట. ఇదంతా ఎవరో చెప్పలేదు. తాను చేసిన మంచిపని గురించి జింటా స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. దేశాన్ని గౌరవించకపోతే తనకు ఎక్కడలేని కోపం వచ్చి ఇలా చేసినట్లు సెలవిచ్చింది. అమ్మడి పోస్టుకు కొన్ని సానుకూల కామెంట్లు పడ్డాయి. అదే సమయంలో కాస్త వ్యతిరేక కామెంట్లు కూడా వచ్చాయి.

ఎంత దేశభక్తి ఉంటే మాత్ర ఇంత తలపొగరుగా ప్రవర్తిస్తారా అంటూ పలువురు ప్రశ్నించారు. కొందరు బయటకు గెంటివేయబడ్డ అబ్బాయి తరపున మాట్లాడారు. అయితే తాను చేసిన పనిని ప్రీతి సమర్ధించుకుంటోంది. ఈ విషయంలో తాను ఏ తప్పు చేయలేదు అని స్పష్టంచేస్తోంది కూడా. అయితే అంతటి దేశ భక్తి ఉంటే భారతీయ సాంప్రదాయం కాని బట్టలను సినిమాల్లో ఎందుకు వేసుకుంటున్నారు? అని పలువురు సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ఇప్పుడయితే అమ్మడి దేశ భక్తిని చూసి గర్వపడాలా.., లేక ఓ అబ్బాయిని బలవంతంగా బయటకు పంపించివేసిన కోపంను చూసి మండిపడాలా మీరే డిసైడ్ కండి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : preity zinta  national anthem  bang bang  latest news  

Other Articles