Canadian hot model nora fatehi item song in puri jagannath junior ntr movie

nora fatehi, nora fatehi hot photos, canadian model nora fatehi, junior ntr movie, puri jagannath movie, junior ntr puri jagannath movie, nora fatehi junior ntr movie, nora fatehi item song

canadian hot model nora fatehi item song in puri jagannath junior ntr movie

టాలీవుడ్ హీరోతో కెనెడియన్ భామ సరసాలు!

Posted: 10/07/2014 06:05 PM IST
Canadian hot model nora fatehi item song in puri jagannath junior ntr movie

టాలీవుడ్ దర్శకనిర్మాతలు అమ్మాయిలను ఇంపోర్ట్ చేసుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ! ఇక్కడి తెలుగమ్మాయిలకు టాలెంట్ లేదనో లేక మరే కారణంతోనో వారికి మనోళ్లు ఆఫర్లు ఇవ్వడం లేదుకానీ.. ఇతర ప్రాంతాలనుంచి ఎంత ఖర్చు పెట్టైనా సరే.. అమ్మాయిలను ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకుంటారు. ఈమధ్యకాలంలో అయితే ఇది మరీ ఎక్కువ అయిపోయింది. ప్రస్తుత కాలంలో వచ్చిన సినిమాలన్నింటిలోనూ ఇతరప్రాంతాల నుంచి తరలివచ్చిన అమ్మాయిలే! ఇప్పుడు తాజాగా మరో హాట్ తార మన తెలుగు చిత్రపరిశ్రమలో ఓ స్టార్ హీరోతో కలిసి సరసాలాడడానికి సిద్ధమవుతోందని టాలీవుడ్ నుంచి వస్తున్న సమాచారం!

కెనడాకు చెందిన నోరా ఫతేహి అనే హాట్ మోడల్ ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేయడానికి ఎంపికైనట్లు తెలుస్తోంది. మొదట్లో ఈ పాటకోసం సన్నీలియోన్ ని అనుకున్నారు. కానీ ఆమెను తప్పించి శృతిహాసన్ ను పరిశీలించారు. అలా పరిశీలన నేపథ్యంలో అనుకోకుండా ఈ సెక్సీ తారను ఎంచేసుకున్నారు. ఇదంతా పూరీ జగన్నాథ్ మహిమే అంటూ ఆ చిత్రబృందం తెలుపుతోంది. నిజానికి పూరీ తన సినిమాల్లోని ఐటెంసాంగుల కోసం ఫారిన్ తారలకే ఎక్కువగా ఎంపిక చేసుకోవడం అలవాటు! దాదాపు అతని సినిమాలన్నింటిలోనూ సగంపైగా ఫారిన్ అమ్మాయిలు ఐటెంసాంగుల్లో నృత్యించినవారే! వారితో హాట్ హాట్ తన సినిమాలో స్టెప్పులు వేయించుకుని, ప్రేక్షకులను ఆకర్షించడంలో పూరీ ఎప్పటికీ ముందుంటాడు. ఒకవేళ సినిమా ఫ్లాపయినా.. ఐటెంసాంగ్ మాత్రం ఖచ్చితంగా హిట్టవుతుంది.

మొరాకో దేశానికి చెందిన నోరా ఫతేహి.. కెనడాలో మోడల్‌గా రాణిస్తోంది. బాలీవుడ్‌లో స్పెషల్‌సాంగ్ కోసం రీసెంట్‌గా ఇండియాకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పూరి.. ఈమె గురించి ఆరా తీశాడట. ఈ క్రమంలో జూనియర్‌ సరసన ఈమెకి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్టు యూనిట్ సభ్యుల టాక్. గతంలో ‘దేవుడు చేసిన మనుషులు’- గాబ్రియల్, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’- స్కార్లెట్ విల్సన్, ‘హార్ట్ ఎటాక్’లో నికోల్ అమీ డ్యాన్స్ చేసిన విషయం తెల్సిందే! ఇప్పుడు తాజాగా ఈ అమ్మడికి - జూనియర్ కి మధ్య ఓ హాట్ సాంగ్ ను షూట్ చేసేందుకు పూరి ప్లాన్ చేసినట్లు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nora fatehi  junior ntr  puri jagannath  tollywood news  canadian models  

Other Articles