Director and producer allani sridhar is planning to make movie on telangana warrior komaram bheem

komaram bheem movie, telangana warrior movie, telangana warrior komaram bheem, director allani sridhar, bollywood movies, tollywood movies, bollywood news, tollywood news, script writer dayakrishan goyal

director and producer allani sridhar is planning to make movie on telangana warrior komaram bheem

బాలీవుడ్ లో తెరకెక్కనున్న తెలంగాణవీరుని కథ!

Posted: 10/07/2014 06:24 PM IST
Director and producer allani sridhar is planning to make movie on telangana warrior komaram bheem

ఒకప్పుడు ఆదివాసీల హక్కులకోసం నిత్యం పోరాటాలు సాగించి, కష్టనష్టాలను ఎదుర్కున్న కొమరం భీమ్ అనే తెలంగాణ యోధుడి కథను ప్రముఖ దర్శకుడు అల్లాణి శ్రీధర్ వెండితెరకు ఎక్కించిన విషయం తెలిసిందే! ఈ మూవీ ఘనవిజయం సాధించడంతో సినీప్రముఖులు దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు. ఆ సినిమాను దర్శకుడు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, ఇటువంటి కథలే టాలీవుడ్ కు చాలా మంచి పేరు తీసుకొస్తాయని ఎందరో అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకోవడంతో దర్శకుడు దీనిని హిందీలో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా త్వరలోనే బాలీవుడ్ తెరీమద తెలంగాణ వీరుని కథను చూడవచ్చునని దర్శకుడు పేర్కొన్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన విషయాల గురించి దర్శకుడు శ్రీదర్ మాట్లాడుతూ... ‘‘1990లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ చిత్రాన్ని తీశాను. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా రెండు దశాబ్దాల తరువాత విడుదలైంది. ఆలస్యంగా విడుదలైనా.. మంచి విజయం సాధించడమేకాకుండా కొమరం భీమ్ గురించి పదిమందికి తెలిసేలా చేసింది. ఎనిమిది సెంటర్లలో ఆ సినిమా వందరోజులు ఆడింది. ఈ సినిమా విడుదలయ్యాకే హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఆ యోధుని విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. మంచి విజయం సాధించడంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాను’’ అని అల్లాణి శ్రీధర్ స్పష్టం చేశారు.

అయితే ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఒక మంచి నటుడిని ఎన్నుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. హిందీ వెర్షన్ కి డాక్టర్ దయాకిషణ్ గోయల్ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారు. తెలుగులో మంచి విజయం సాధించినట్లే హిందీలో కూడా సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles