Mahesh babu multi starrer movie with rajinikanth

rajinikanth, rajinikanth wiki, rajinikanth latest, rajinikanth lingaa movie, rajinikanth family, rajinikanth kashmir tour, rajinikanth secrets, rajinikanth photos, rajinikanth stills, lingaa movie latest updates, lingaa movie songs, lingaa movie release date, mahesh babu movie with rajinikanth, mahesh rajinikanth movie, mahesh babu, mahesh babu wiki, mahesh babu latest, mahesh babu family, mahesh babu latest moveis, mahesh babu aagadu movie, rajinikanth movie with mahesh babu, aagadu movie review, aagadu movie rating, kochadian, eros, tollywood, koliwood, latest news

rumors thattamil super star rajinikanth agreed to act in a multi starrer movie with mahesh babu : two super stars of tamil and telugu industry to act in a movie soon after rajini's linga and an other movie completes

త్వరలో :: మహేష్-రజినీ మల్టీ స్టార్ సినిమా..?

Posted: 09/25/2014 04:48 PM IST
Mahesh babu multi starrer movie with rajinikanth

సినిమా అభిమానులకు సూపర్ శుభవార్త. ఇద్దరు సూపర్ స్టార్లను ఒకే తెరపై చూసే అదృష్టం తెలుగు, తమిళ ప్రేక్షకులకు కలిసి దొరకనుంది. తమిళ సూపర్ స్టార్ రజినికాంత్, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. ఈ మద్య మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువ కాగా.., అదే పంధాలో వీరిద్దరి కాంబినేషన్ లో కూడా సినిమా వస్తుందని గుసగుసలు వస్తున్నాయి. ఇదే నిజం అయితే ఇద్దరు స్టార్ల అభిమానులకు దసరా, సంక్రాంతి కలిసి చేసుకున్నంత సందడి తప్పదు. దీనికి సంబంధించి గుసగుసల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం రజినికాంత్ ‘లింగా’ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ లోని రామోజి ఫిలింసిటిలో ఉన్న రజినీని ప్రముఖ నిర్మాత ఎం. సూర్యనారాయణ బాబు కలిశారట. ఈ సందర్బంగా ఇద్దరి మద్య సినిమాలపై చర్చ జరిగి.., మల్టీస్టారర్ సినిమా చేసేందుకు తమిళ సూపర్ స్టార్ కు ఒకే చెప్పినట్లు ఫిలింసిటి నుంచి వార్తలు వస్తున్నాయి. అటు మహేష్ కూడా ఇందుకు ఓకే చెప్పాడట. ప్రస్తుతం ‘లింగా’ సినిమా షూటింగ్ పూర్తయ్యాక... తనకు గతంలో యూరోస్ (ముంబై) కంపనీతో ఒప్పుకున్న మరొక సినిమా చేయాల్సి ఉందన్నారు. వారి సినిమా పూర్తి కాగానే.., ప్రిన్స్ తో సినిమా చేసేందుకు అభ్యంతరమే లేదని రజినీకాంత్ ప్రకటించాడట.

ఎవరీ సూర్యనారాయణ

ఇక సూర్యనారాయణ గురించి తెలుసుకోవాలంటే.., కృష్ణ, కృష్ణంరాజు కాలంకు వెళ్ళాలి. కృష్ణంరాజు హీరోగా ‘మనుషులు చేసిన దొంగలు’ సినిమాతో నిర్మాతగా రంగ ప్రవేశం చేసిన సూర్యానారయణ బాబు తెలుగు, కన్నడ బాషల్లో దాదాపు 30 సినిమాలు చేశారు. ఇందులో రజినీకాంత్ తో తెలుగులో ‘రామ్ రాబర్ట్ రహీమ్’, హిందీలో ‘మేరా అదాలత్’, ‘మహాగురు’ సినిమాను నిర్మించారు. ఇక కృష్ణ-రజినీకాంత్ కాంబినేషన్ లో ‘అన్న తమ్ముల సవాల్’ వంటి సినిమాలు చేశారు. అటు మహేష్ బాబుతో ‘ శంఖారావం’, ‘బజారు రౌడీ’ సినిమాలు చేశారు. చివరగా ‘ అల్లుడు దిద్దిన కాపురం’ సినిమాను నిర్మించారు. ఈయన కృష్ణకు దగ్గరి బంధువు కూడా.

ఇలా పలు సూపర్ స్టార్లతో పలు సినిమాలు చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న సూర్యనారాయణ బాబు విషయం రజిని కాంత్ ఓ నిర్మాత దగ్గర ప్రస్తావించాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్యం వెంటనే తమిళ స్టార్ ను కలవగా.., సినిమాల గురించి చర్చ జరిగింది. ఆయన ఒప్పుకుంటే మళ్ళీ సినిమాలు నిర్మించేందుకు సిద్ధమని చెప్పాడట. అదెంత పని.., ఇంకో సినిమా పూర్తయితే తర్వాత నీదే పో. అని రజినీ చెప్పాడట. ఈ విషయం ప్రిన్స్ కు చెప్పగా.., ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశాడని ప్రచారం జరుగుతోంది. అయితే లింగా ఓ సలహా ఇచ్చాడట. ఇప్పుడున్న అల్లాటప్పా కధల్లా కాకుండా.., అప్పట్లో కృష్ణతో చేసిన సినిమాలా చరిత్రలో నిలిచిపోయేలా ఉంటే బాగుంటుంది చూడు అన్నాడట. అందుకు సూర్యనారాయణ కూడా ఓకే చెప్పి.. తాను చూసుకుంటాను అన్నాడట. ఇఫ్పుడు అర్జంటుగా వీరికి ఒక మంచి కధ కావాలి. ఈ సూపర్ స్టార్ల మల్టీ స్టారర్ సినిమాకు సూపర్ కధ అందించేది ఎవరో మరి ?.  

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  rajinikanth  lingaa  aagadu  

Other Articles