Mahesh babu helps to aagadu producers

mahesh babu, mahesh babu wiki, mahesh babu family, mahesh babu son, mahesh babu daughter, mahesh babu latest, aagadu movie, aagadu movie review, aagadu latest news, aagadu movie download, tollywood, film news, 14 reels entertainment, mahesh remuneration, mahesh babu aagadu remuneration

mahesh babu shows his goodness on aagadu producers by not taking balance amount due to him from aagadu producer : with aagadu failure mahesh babu not taken total remuneration leaves some of balance amount

ఆగమైపోతే ఆదుకున్నాడు

Posted: 09/25/2014 03:17 PM IST
Mahesh babu helps to aagadu producers

మహేష్ బాబు ప్రిన్స్ అనిపించుకున్నాడు. మరోసారి తన ఉదారగుణం చాటాడు. ‘ఆగడు’ సినిమాతో నష్టాలు ఎదుర్కున్న నిర్మాతకు తన వంతు సాయం చేశాడు. ఈ సినిమాకు సంబంధించి కొంత డబ్బును మహేష్ వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాను నిర్మించిన ‘14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్’ బ్యానర్ నుంచి రావాల్సిన బ్యాలెన్స్ వదిలేసుకున్నాడట. ఈ మూవీకి మహేష్ రూ.18కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో ముందుగా కొంత చెల్లించగా.., బ్యాలెన్స్ డబ్బులు ఇక వద్దు అనుకున్నాడట.

గతవార విడుదల అయిన ‘ఆగడు’ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఖర్చు ఎక్కువ కావటంతో పాటు.., కధలో పెద్దగా బలం లేకపోవటంతో నిలవలేకపోయింది. దీంతో భారీగా ఆశించిన నిర్మాతలు, డిస్ర్టిబ్యూటర్లు కుదేలయ్యారు. ఎంతో మంచి టాక్ వస్తుంది. రికార్డులు బ్రేక్ చేస్తుంది అనుకుంటే.., ఇలా డివైడ్ టాక్ రావటంతో అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపటం లేదు. అందువల్లే నిర్మాతలను ఆదుకునేందుకు మహేష్ పారితోషికం వదిలేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ‘రభస’ సినిమా ఫెయిల్యూర్ తో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించమని చెప్పాడు. తనకు రెమ్యునరేష్ తక్కువ ఇవ్వటంతో పాటు.., హీరోయిన్లకు కూడా డబ్బు ఎక్కువగా ఇవ్వొద్దని సూచించాడు. ఇక భారీ సెట్టింగులు, ఎక్కువ డబ్బు ఖర్చు లేకుండా సినిమాలు తీయాలని సూచించారు. ఇదే తరహాలో మహేష్ కూడా రెమ్యునరేషన్ తక్కువగా తీసుకున్నాడు. మరి ప్రిన్స్ కూడా కోతలు పెడతాడా.. లేదా చూడాలి. ఏదయితేనేం.., ఫెయిల్ అయితే.., డబ్బు పోతే కలిగే బాధ వీరికి తెలుసు, అందుకు సంతోషించాలి.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  aagadu  tollywo0d  remuneration  

Other Articles