Deepika padukone wants to work with prince mahesh babu in telugu movies

deepika padukone, mahesh babu, telugu movie, arjun kapoor, finding fanny, deepika padukone hot photo shoot, deepika padukone bikini photos, deepika padukone with mahesh babu

deepika padukone wants to work with prince mahesh babu in telugu movies

మహేష్ బాబుపై మనసు పారేసుకున్న దీపికా!

Posted: 09/03/2014 01:28 PM IST
Deepika padukone wants to work with prince mahesh babu in telugu movies

(Image source from: deepika padukone wants to work with prince mahesh babu in telugu movies)

బాలీవుడ్ లో వరుస విజయాలతో అగ్రకథానాయికగా దూసుకుపోతున్న దీపికా పదుకొనే.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుపై మనసు పారేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా తానే ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం చర్చనీయాంశంగా మారిపోయింది. దీంతో ఇండస్ట్రీలో పలురకాల వాదనలను వినిపిస్తున్నారు. బాలీవుడ్ తనదైన ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దీపికా.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా వెలుగు వెలిగిపోదామనే భావనతోనే టాలీవుడ్ అగ్రకథానాయకుడైన ప్రిన్స్ ను పొగడ్తలతో ముంచెత్తుతోందని చెప్పుకుంటున్నారు.

దీపికా పదుకునే తాజాగా నటించిన ‘‘ఫైండింగ్ ఫన్నీ’’ మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడింది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు మహేష్ బాబుని పొగడ్తలతో ముంచెత్తింది. ‘‘తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరు?’’ అని ఒక విలేకరి ప్రశ్నించగా.. అందుకు తనకు మహేష్ బాబు ఇష్టమని వెంటనే సమాధానమిచ్చింది. పర్సనాలిటీలో అతను చాలా కూల్ గా, డ్యాషింగ్ గా వుంటాడని తెలిపింది. అలాగే బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కూడా తనకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా దీపికా మాట్లాడుతూ.. తెలుగులో తనకు నటించాలని ఎంతో ఆశగా వుందని.. తెలుగుచిత్రాల్లో నటించాలని ఎదురుచూసినప్పుడు ఆమెకు ఎటువంటి అవకాశాలు రాలేదని పేర్కొంది. అయితే ఒకసారి అవకాశం వచ్చినా.. అందుకు సమయం చిక్కపోవడంతో వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. కళాకారులకు భాషతో సంబంధమేమీ లేదని.. మంచి అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటిస్తానని దీపికా స్పస్టం చేసింది. అంటే.. తెలుగులో ఛాన్సిస్తే ఈ అమ్మడు నటించడానికి రెడీ అంటూ పరోక్షంగానే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా.. మహేష్ బాబును ట్రాక్ లో పడేస్తున్నట్టు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deepika padukone  mahesh babu  arjun kapoor  tollywood  bollywood  

Other Articles