Actress mla roja helps director kalanjiyam medical treatement for better checkup

director kalanjiyam, kalanjiyam latest news, kalanjiyam accident, actress roja, roja latest news, roja kalanjiyam, roja with kalanjiyam, mla roja latest news, actress anjali latest news

actress mla roja helps director kalanjiyam medical treatement for better checkup

రోజా లేకపోతే కళంజియం బ్రతకలేడట!

Posted: 09/03/2014 12:54 PM IST
Actress mla roja helps director kalanjiyam medical treatement for better checkup

(Image source from: actress mla roja helps director kalanjiyam medical treatement for better checkup)

తన సినిమాలో నటిస్తానంటూ డబ్బులు తీసుకుని ఉడాయించిందంటూ తెలుగునటి అంజలి మీద ఆరోపణలు చేసి, రాద్ధాంతం సృష్టించిన తమిళ దర్శకుడు కళంజియం అందరికీ గుర్తుండే వుంటాడు. వారిద్దరి మధ్య ఆ డబ్బుల గొడవ ఇంకా సమసిపోలేదు కానీ... వారికి సంబంధించి ఈమధ్యకాలంలో ఎటువంటి వివాదాలు జరగలేదు. దీంతో ఎవరికివారు తమతమ పనుల్లో పూర్తిగా మునిగిపోయారు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. కళంజియం తాజాగా తాను నటి రోజా లేకుండా వుండలేనంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నాడు. ‘‘నటి రోజా లేకపోతే నేను బ్రతకలేను’’ అంటూ తన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే కళంజియం ఒక పెళ్లికి వెళుతుండగా కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే! ఆ ఘటనలో తనతోపాటు వున్న ఒక వ్యక్తి మరణించగా... ప్రాణాపాయ స్థితిలో వున్న కళంజియం ఆసుపత్రిలో చికిత్స పొంది తిరిగి కోలుకుంటున్నాడు. అనంతరం తనతో జరిగిన ఈ ఉదంతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పేర్కొన్నాడు. కారు ప్రమాదానికి గురై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తనను శాసనసభ్యురాలు-నగర ఎమ్మెల్యే-నటి రోజా మానవత్వంతో కాపాడిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ప్రాణాలతో వుండటానికి కారణం నటి రోజానేనంటూ అతను ప్రకటించాడు.

ఈ నేపథ్యంలోనే అతను మాట్లాడుతూ.. ‘‘రాజమండ్రిలో జరిగిన తన మిత్రుడి పెళ్లికి హాజరై చెన్నైకి తిరిగొస్తుండగా కారు చక్రం ఒక్కసారిగా బద్దలైపోయిందన్నారు. దాంతో కారులో వున్నవారందరూ హైవే రోడ్డుపై పడిపోయారన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందోనని, కళ్లు తెరిచేసరికి ప్రభుత్వాసుపత్రిలోని బెడ్ పై పడివున్నానని తెలిపాడు. ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు లేరని.. వెంటనే వారిని రప్పించి వైద్యం అందించాల్సిందిగా పోలీసు అధికారులు ఆస్పత్రి సిబ్బందిని కోరినట్లు గుర్తుందని చెప్పాడు. తీవ్రగాయాలతో ఒళ్లంతా రక్తసిక్తమయిందని, సృహ వచ్చిపోతూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో వున్నానని తెలిపాడు. అప్పుడు తన జీవితంలో ఒక దేవతలా నటి రోజా వచ్చిందని పేర్కొన్నాడు.

ఒక వ్యక్తిగా నేరుగా తన బెడ్ వద్ద వున్న పోలీస్ అధికారి దగ్గరకు వచ్చి తాను రోజా మేడమ్ నుంచి వస్తున్నానని... మేడమ్ ఫోన్ లో లైన్ లో వున్నారు మాట్లాడండి అంటూ చెప్పారన్నారు. అంతే! అప్పటికప్పుడు నిముషాల్లోనే ప్రభుత్వాసుపత్రి నుంచి ఒక పెద్ద ప్రైవేటు ఆసుపత్రికి తనను మార్చినట్లు చెప్పాడు. తననుంచి ఫీజు తీసుకోకుండా మెరుగైన వైద్యం నుంచి ప్రాణాపాయం నుంచి కాపాడారన్నాడు. ఇందుకు కారణమైన రోజాకు, ఆమె భర్త ఆర్.కె.సెల్వమణికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని కళంజియం స్పష్టం చేశాడు. చివరగా.. ‘‘రోజా చేసిన సహాయం వల్లే నేను ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాను. ఆమె లేకపోతే నేను బ్రతికుండేవాడిని కానేమో’’నంటూ తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : director kalanjiyam  actress mla roja  actress anjali  private hospitals  

Other Articles