Boyapati srinu sai srinivas movie opening

Bellamkonda Srinivas Boyapati movie opening, Boyapati Bellamkonda Srinivas movie opening, Boyapati Srinivas Bellamkonda Srinivas movie opening, Alludu Seenu - Boyapati Srinu movie launch details, Bellamkonda Srinivas movie opening, Bellamkonda Srinivas movie opening stills, Bellamkonda Srinivas movie opening news

sai Srinivas, Boyapati film launched today.. that Bellamkonda Sai Sreenivas film will be in the direction of Boyapati Srinu. Srinivas movie opening, Bellamkonda Srinivas movie opening stills, Bellamkonda Srinivas movie opening news

అల్లుడుశీనుతో బోయపాటి మొదలెట్టేసాడు

Posted: 08/27/2014 11:21 AM IST
Boyapati srinu sai srinivas movie opening

బెల్లంకొండ సురేష్ తనయుడు సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘అల్లుడుశీను’ ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది. తమన్నా ఐటెం సాంగులో నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా సాయిశ్రీనివాస్ కు మంచి హిట్టును అందించింది.

‘అల్లుడుశీను’ తర్వాత సాయిశ్రీనివాస్ హీరోగా మరో చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో, బెల్లంకొండ సురేష్ సమర్పణలో నిర్మాత బెల్లంకొండ గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఈరోజు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీ సినీ పెద్దలు విచ్చేసి, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు క్లాప్ కొట్టారు. ‘అల్లుడుశీను’ సినిమాలో ఐటెం సాంగులో నటించిన తమన్నా... ఈ సినిమాలో సాయి సరసన హీరోయిన్ గా నటించనుంది.

సాయి మొదటి సినిమాకు సూపర్ హిట్ సాంగ్స్ ను అందించి, సినిమా విజయానికి మూలకారకుడిగా నిలచిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bellamkonda Srinivas  Boyapati Srinivas  Alludu Seenu Boyapati  Bellamkonda  

Other Articles