Ram charan varun tej sai dharam tej allu aravind celebrates chiranjeevi 59 celebrations

ram charan tej, chiranjeevi birthday celebrations, chiranjeevi fans, chiranjeevi latest news, ram charan latest movie, ram charan chiranjeevi birthday, ram charan news, varun tej movies, sai dharam tej movies, allu aravind

ram charan varun tej sai dharam tej allu aravind celebrates chiranjeevi 59 celebrations : tollywood megapower star ram charan tej celebrates chiranjeevi birthday along with his family members varun teja, sai dharam tej, allu aravind and also with his fans

తండ్రి లోటును తీర్చిన రామ్ చరణ్

Posted: 08/22/2014 05:24 PM IST
Ram charan varun tej sai dharam tej allu aravind celebrates chiranjeevi 59 celebrations

మెగా కుటుంబసభ్యుల మధ్య వున్న సఖ్యత బహుశా మరే సెలబ్రిటీల కుటుంబంలో వుండకపోవచ్చు. తమ మధ్య ఎన్ని విబేధాలు వున్నప్పటికీ.. కష్టసమయాల్లో ఒకర్నొకరు ఆదుకోవడంలో ఈ కుటుంబసభ్యులు ఎప్పటికీ ముందుంటారు. అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి స్థాపిస్తే.. దానికి ప్రచారకర్తగా పవన్ కల్యాణ్ నిద్రాహారాలు మానేసి ఎన్నో కష్టాలను అనుభవించిన విషయం అందరికీ తెలిసిందే! అయితే చిరు తన పార్టీకి కాంగ్రెస్ లో విలీనం చేశాడని అలిగిన పవన్ కొన్నాళ్లవరకు అన్నయ్యతో దూరంగా వున్నప్పటికీ.. తమ మధ్య వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని పవన్ ఎప్పుడో తేల్చేశాడు. అది వేరే విషయం! ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ తేజ తన తండ్రి చేయాల్సిన పనిని తానే చేసి అభిమానులను సంతృప్తి పరిచి.. మెగా తనయుడని అనిపించుకున్నాడు.

శుక్రవారం (22.08.2014) నాడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినమన్న విషయం అందరికీ తెలిసిందే! అయితే తన బర్త్ డే వేడుకలను అభిమానుల మధ్య జరుపుకుంటాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన ఫ్యాన్స్ కు చిరు నిరాశే మిగిల్చారు. ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి నేపాల్ లో వుండే దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. దీంతో నిరుత్సాహంలో మునిగిపోయిన ఫ్యాన్స్ కు నేనున్నానంటూ రామ్ చరణ్ ముందుకొచ్చాడు. తన తండ్రి జన్మదిన వేడుకలను చెర్రీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించి.. ఆ పార్టీకి తన కుటుంబసభ్యులతోపాటు అభిమానులను ఆహ్వానించాడు. ఈ వేడుకలో అల్లు అరవింద్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి మెగాహీరోలు కూడా హాజరయ్యారు. ఇలా మెగాహీరోలంతా ఒకేచోటు గుమికూడటంతో అక్కడికి విచ్చే అభిమానులందరూ హర్షం వ్యక్తం చేశారు. మొత్తంగా చెప్పాలంటే.. ఇక్కడ చెర్రీ ‘‘గోవిందుడు అందరి వాడేలే’’ అని అనిపించుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan teja  chiranjeevi  sai dharam tej  varun tej  allu aravind  

Other Articles