Sonakshi sinha ice bucket challenge creating sensations

sonakshi sinha, sonakshi sinha hot photo shoot, sonakshi sinha ice bucket, sonakshi sinha latest news, sonakshi sinha hot videos, sonakshi sinha ice bucket video, sonakshi sinha gallery

sonakshi sinha ice bucket challenge creating sensations : the bollywood bold actress sonakshi sinha giving messages to indian people and celebrities by participating in ice bucket challenge to not waste the water

మతిపోగొడుతున్న సోనాక్షీ ఐస్ బకెట్ ఛాలెంజ్ వీడియో!

Posted: 08/22/2014 06:10 PM IST
Sonakshi sinha ice bucket challenge creating sensations

భాలీవుడ్ చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చుకున్న కొన్నాళ్లకే తన భారీ అందాలతో ప్రేక్షకజనాలను మత్తెక్కించి మైమరచిన సోనాక్షీ సిన్హా.. తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకుంది. తాను నటించిన మొదటి సినిమా ‘‘దబాంగ్’’ బాక్సాఫీస్ దగ్గర బద్దలు కొట్టడంతో ఈమెను గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకుంది. ఒకదాని మీద ఒకటి వరుసగా సినిమాలు చేసుకుంటూ టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది. ముఖ్యంగా ఈ అమ్మడిలో ప్రత్యేకించి చెప్పుకోవాలంటే.. తన భారీ అందాలను నిస్సిగ్గుగా పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని చూపిస్తూ.. అందరినీ అలరించేస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బొద్దుగా, ముద్దుగా, భారీ అందాలను కలిగిన ఈమెలాంటి మరో హీరోయిన్ బాలీవుడ్ లో లేనేలేదు. అందరూ స్లిమ్ గా కనిపించేందుకు డైటింగ్, ఎక్సర్ సైజ్ లు వంటివి చేస్తుంటే.. సోనాక్షీ మాత్ర అటువంటి పద్ధతులను పాటించకుండా బొద్దుగానే వుండటంతో ఈమెకు ఒక ప్రత్యేక స్థానం లభించింది.

ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం మన ఇండియన్ చిత్రపరిశ్రమలో ముఖ్యంగా బాలీవుడ్ లో ఐస్ బకెట్ ఛాలెంజ్ ను తెగ ఫాలో అయిపోతున్నారు. సినిమా సెలబ్రిటీల నుంచి క్రీడాకారులందరూ ఈ చాలెంజ్ లో భాగస్వామ్యం అవుతున్నారు. సాధారణంగా ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. అమీట్రోపిక్ లేటెరల్ సిరాసిస్ (ALS) అనే వ్యాధిని నిరోధించడం! ఈ వ్యాధి సంగతేమో కానీ ప్రముఖులంతా ఈ ఛాలెంజ్ ను తెగ ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు తాజాగా వీరి జాబితాలోకి సోనాక్షీ సిన్హా కూడా ఎంట్రీ ఇచ్చేసుకుంది. అందరూ ఒకేవిధంగా ఈ ఛాలెంజ్ ను ఫాలో అవుతుంటే.. సోనాక్షీ మాత్రం చాలా ప్రత్యేకంగా ఇందులో పాల్గొంటూ అందరి మతుల్ని పోగొడుతోంది. ఈమె వీడియో యూట్యూబ్ లోకి వచ్చినప్పటి నుంచి అందరూ తెగ ఆసక్తిగా చూసేస్తున్నారు. కొన్ని గంటలకే వేలసంఖ్యలో క్లిక్కుల మీద క్లిక్కులు! మిగతా సెలబ్రిటీలందరినీ తలదన్నేసే విధంగా సోనాక్షీ ఈ ఛాలెంజ్ లో పాల్గొని ముందుకు దూసుకుపోతోంది.

సాధారణంగా సెలబ్రిటీలందరూ ఒకరిమీద ఒకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. కానీ సోనాక్షీకి మాత్రం ఎవ్వరూ ఛాలెంజ్ చేయలేదు. అయినప్పటికీ తాను ఇందులో భాగం పంచుకుంది. అయితే ఇందులో పాల్గొంటూ ఆమె అందరినీ ఒక సందేశాన్నిస్తోంది. ఇది పబ్లిసిటీ వ్యవహారం కాదని తెగేసి చెబుతూ.. అందరికంటే భిన్నంగా ఈ అమ్మడు కేవలం ఒకే ఒక్క ఐస్ క్యూబ్ ను తన తల మీద పోసుకుంది. దీంతో ఈ వీడియోను చూసిన అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఏంటి సోనాక్షీ ఇలా చేస్తోంది..? అంటూ అనుకుంటున్న తరుణంలో.. ఆ వీడియోలోనే ఒక మంచి సందేశాన్ని అందించింది ఈ బొద్దుగుమ్మ. ఈ సందేశాన్ని విన్న ప్రతిఒక్కరూ ఔరా అంటూ నోళ్లవెళ్లబెట్టుకున్నారు.

విదేశాల్లో వాతావరణం చాలా చల్లగా వుండటంతోపాటు వారికి నిత్యం నీళ్లు కూడా అందుబాటులో వుంటుంది. అందుకే విదేశీయులంతా ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. కానీ మన భారతదేశంలో అంత చల్లని వాతావరణం లేదు. అలాగే అందరికీ సరిపడేంత నీళ్లు కూడా లేవు. కాబట్టి నీటిని పొదుపు చేయండి... నీళ్లు లేని ప్రదేశాలకు సరఫరా చేసి పేదలకు దాహం తీర్చండి.. అంతేకానీ నీళ్లు వున్నాయి కదా అని ఇలా అనవసరంగా వేస్ట్ చేయొద్దు’’ అంటూ సందేశం ఇస్తోంది. ‘‘నీటిని ఒంటిమీద పోసుకోవడం కంటే విరాళంగా ఇచ్చి చూడండి.. దాని అనుభవం ఎలా వుంటుందో’’ అని పేర్కొంటూ.. ‘‘నీటిని పొదుపు చేయండి.. దుబారా చేయకండి’’ అంటూ సూక్తులు వెల్లడిస్తోంది. ఐస్ బకెట్ నెత్తిపై కుమ్మరించుకుని www.als.org సైట్ కి లాగిన్ అయి విరాళాలు అందజేయాలని సోనాక్షి సూచించింది.

ఒకవిధంగా ఆలోచిస్తే.. సోనాక్షీ చెబుతోంది కూడా నిజమే! చల్లని వాతావరణం వున్న ప్రదేశాల్లో నీటిశాతం చాలా ఎక్కువగా వుంటుంది. అదే వేడిగా వున్న ప్రాంతాల్లో నీటి శాతం తక్కువగా వుంటుంది. అమెరికాలాంటి విదేశాల్లో వాతావరణం ఎప్పటికీ చల్లగా వుంటుంది కాబట్టి.. వారికి నీళ్లు నిత్యం అందుబాటులోనే వుంటాయి. పైగా అక్కడి జనాభా కూడా తక్కువ! అదే మన భారతదేశం విషయానికి వస్తే... తాగునీరు శాతం చాలా తక్కువగా వుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే తాగునీరు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి! అటువంటి తరుణంలో నీటిని వేస్ట్ చేయడం కంటే.. ఆదాయం చేస్తే ఇతరులకు దాహాన్ని తీర్చే సౌభాగ్యం కలుగుతుంది. కాబట్టి నీటిని ఆదా చేద్దాం..!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles