Deeksha panth grabbed the offer in pawan kalyans gopala gopala movie

deeksha panth, deeksha panth hot photos, deeksha panth hot photo shoot, hyderabad model deeksha panth, deeksha panth poonam jhawar, deeksha panth latest photo shoot, deeksha panth hot scenes, deeksha panth pawan kalyan, deeksha panth gopala gopala movie, deeksha panth movies

deeksha panth grabbed the offer in pawan kalyans gopala gopala movie : The hyderabad model deeksha panth grabs the huge offer in pawan kalyan's gopala gopala movie. She playing poonam jhawar role in the original oh my god movie in which she looks beautiful and young.

పవన్ వెంటపడుతున్న తెలుగు మోడల్!

Posted: 08/20/2014 01:01 PM IST
Deeksha panth grabbed the offer in pawan kalyans gopala gopala movie

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజీ అభిమానుల్లో ఎంతుందో అందరికీ తెలిసిన విషయమే! ముఖ్యంగా అబ్బాయిలకంటే అమ్మాయిలు మరీ వెంటపడుతుంటారు. పవన్ లాంటి డాషింగ్ అండ్ గుడ్ లుకింగ్ హీరో ఇంకెవరూ లేరంటూ తెగ మురిసిపోతుంటారు. ఈయన ఎక్కడ కనబడితే చాలు.. అక్కడ అమ్మాయిలు వాలిపోతుంటారు. ఇదిలావుండగా.. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక మోడల్ పవన్ వెంట తెగపడుతోందని సమాచారం! అందుకు ఆమె దాసి అవతారమెత్తి మరీ ఇతని చుట్టూ తిరుగుతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదులెండి.. రీల్ లైఫ్ లో!

పవన్ కల్యాణ్ మోడ్రన్ శ్రీకృష్ణుడు అవతారంలో తాజాగా నటిస్తున్న ‘‘గోపాలా గోపాలా’’ చిత్రంలో హైదరాబాద్ మోడల్ దీక్షా పంత్ నటించే బంపరాఫర్ కొట్టేసింది. ఇప్పటికే ఈ సినిమాలో మధుశాలిని రిపోర్టర్ గా ఛాన్స్ కొట్టేసిన తరుణంలో... ప్రస్తుతం ఈ హాట్ వర్మ అమ్మడు కూడా జాయిన్ అయిపోయింది. బాలీవుడ్ లో తెరకెక్కిన ‘‘ఓ మై గాడ్’’ చిత్రానికి రీమేక్ అయిన ‘‘గోపాలా గోపాలా’’ చిత్రంలో దీక్షాపంత్ హిందీలో పూనమ్ ఝవార్ నటించిన పాత్రలో కనిపించబోతోంది. హిందీ చిత్రంలో పూనమ్ ఝవార్ చాలా యంగ్ గా కనిపించిన తరుణంలో.. ఆ పాత్రకు దీక్షాపంత్ అయితేనే బాగుంటుందనే నిర్ణయంతోనే ఈమెను సినిమాలో తీసుకున్నట్టు యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. పూనమ్ లాగే ఈ అమ్మడు దేవుడికి దాసిలా నటించనుంది.

డైరెక్టర్ డాలీ దర్శకత్వంలో వస్తున్న గోపాలా గోపాలా చిత్రంలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలతో పెద్ద క్యాస్టింగ్ నే తీసుకున్నారు. ఒకవైపు పవన్ కల్యాణ్, వెంకటేష్ వంటి పెద్ద స్టార్లు లీడ్ రోల్ లో కనిపిస్తున్న ఈ చిత్రంలో.. శ్రియ శరన, సాయికుమార్, మధుశాలినీలు నటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా జూనియర్ ఉదయభానుగా పేరు సంపాదించుకున్న దీక్షాపంత్ కూడా ఇందులో చేరిపోయింది. ఇంకా ఈ సినిమాలో ఇంకెంతమంది సెలబ్రిటీలు జాయిన్ అవుతారోనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad model deeksha panth  pawan kalya  gopala gopala movie  poonam jhawar  

Other Articles