Raviteja kick 2 movie shooting started

kick 2 movie, mass maharaja raviteja, raviteja latest news, kick 2 movie shooting launch stills, kick 2 movie stills, kick 2 movie news, allu arjun junior ntr raviteja, allu arjun junior ntr kick 2 movie launch, kick 2 movie shooting stills, hero kalyan ram, director surendar reddy

raviteja kick 2 movie shooting started : tollywood mass maharaja kick 2 movie shooting started from august 20. In this ceremony junior ntr and allu arjun are also attended. surendar reddy directing this movie and hero kalyan producing

రవితేజ ‘‘కిక్-2’’లో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్!

Posted: 08/20/2014 12:38 PM IST
Raviteja kick 2 movie shooting started

టాలీవుడ్ మాస్ మహారాజా, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘‘కిక్’’ సినిమా అందరికీ ఎలా మత్తెక్కించిందో తెలిసిందే! అప్పట్లో ఆ సినిమా టాలీవుడ్ రికార్డుల్ని బ్రేక్ చేసి, సరికొత్త కోణాన్ని పరిచయం చేసింది. రవితేజ కెరీర్ లోనే అది ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిపోయింది. అందులో రవితేజలోని యాక్షన్ యాంగిల్స్ నుంచి కామెడీ థ్రిల్లర్ గా అన్ని కోణాలను చూడవచ్చు. మొత్తంగా చెప్పాలంటే.. ఆ సినిమా కిక్కే కిక్కు! దాంతో ‘‘కిక్’’ సినిమాను రీమేక్ చేస్తామని సురేందర్ రెడ్డి అప్పుడే ప్రకటించినప్పటికీ.. కొన్ని కారణాల రీత్యా అది వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ‘‘కిక్ 2’’ మూవీ ముహూర్తం కూడా జరిగిపోయింది.

ఒకేసారి ఆరు సినిమాలు ఘోరంగా పరాజయం అయిన తర్వాత ‘‘బలుపు’’ సినిమాతో భారీ హిట్ అందుకోవడంతో ఫుల్ జోష్ లోకి వచ్చిన రవితేజ... మాంచి ఎనర్జటిక్ రోల్ లో ‘‘పవర్’’ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ‘‘రేసుగుర్రం’’ మూవీ విజయంతో మాంచి జోరుమీదున్న దర్శకుడు సురేందర్ రెడ్డితో మరోసారి చేతులు కలిపి ‘‘కిక్ 2’’ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా ముహూర్తం బుధవారం (ఆగస్టు 20) ఉదయం జరిగింది. అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు కూడా హాజరయ్యారు. అయితే వీరిద్దరూ ఈ సినిమాలో నటించడం లేదులెండి. తమ మధ్య వున్న మంచి ఫ్రెండ్ షిప్ కారణంవల్లే ఈ మూవీ ముహూర్తానికి హాజరయ్యారు. ‘‘కిక్’’ తరహాలోనే ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవాలని వారు ఆశించారు.

ఆగస్టు 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ కూడా ‘‘కిక్’’ లాగే డబుల్ కిక్ ఇవ్వడం ఖాయమని మూవీ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ‘‘అతనొక్కడే’’ సినిమాతో సురేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేసిన కళ్యాణ్ రామ్ ‘‘కిక్ 2’’ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథను వక్కంతం వంశీ రాయగా.. ‘‘కిక్’’ చిత్రానికి సంగీతం అందించిన తమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఫ్లైట్ మిస్ అవడం వల్ల తమన్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఏదేమైనా.. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలబడిపోయారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kick 2 movie  raviteja  junior ntr  allu arjun  kalyan ram  

Other Articles