Sreeshanth to act in telugu movie

cricketer sreeshanth, sreeshanth case, match fixing, puri jagannath, puri jagannath latest movie, puri jagannath's cave house, tollywood news, telugu latest updates, madhura sreedhar

cricketer sreeshanth will soon seen in telugu silver screen : sreeshanth met directors puri jagannath, madhura sreedhar to discuss about tollywood entry

టాలీవుడ్ పై శ్రీశాంత్ కన్ను

Posted: 08/12/2014 03:22 PM IST
Sreeshanth to act in telugu movie

సుడి ఉంటే ఎక్కడైనా, ఎలాగైనా బ్రతకవచ్చంటారు. మరి క్రికెటర్ శ్రీశాంత్ కు ఆ సుడి ఉందో లేదో తెలియదు కానీ.., టాలీవుడ్ పై కన్నేశాడు మనోడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవిత కాల నిషేధం ఎదుర్కుని క్రికెట్ కు దూరమయ్యారు. దీంతో ఇప్పుడు సినీ పరిశ్రమలో లక్కు పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖుతో సంప్రదింపులు జరిపిన ఫాస్ట్ బౌలర్ అంతే ఫాస్ట్ గా తెలుగు సినీ ప్రముఖుల దగ్గరకు వచ్చాడు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన శ్రీ దర్వకుడు పూరీ జగన్నాధ్ కేవ్ కు అదేనండీ పూరి కలల సౌధానికి వెళ్ళాడు. ఇళ్ళు చూసి బాగుంది. డిజైన్ లో టేస్ట్ తెలుస్తుంది అని మంచి సరదాగా మాట్లాడాడు. పనిలో పనిగా అసలు విషయానికొచ్చాడు అసలే మనవాడు ఫాస్ట్ బౌలర్ కదా ఆ మాత్రం స్పీడ్ ఉంటుంది లెండి.

పూరీ జగన్నాధ్ తో పాటు మదుర శ్రీధర్ ను కూడా శ్రీశాంత్ కలిసి సినిమాలపై చర్చించినట్లు సన్నిహితులు చెప్తున్నారు. సినిమాపై తనకున్న కసినంతా అక్కడ చూపించినట్లు తెలుస్తోంది. సినిమా తీయటానికి గల కారణాలు, అవసరాలు అన్నిటినీ చర్చించకపోయినా.., కొన్ని విషయాలపై వీరు మాట్లాడుకున్నారు. ముఖ్యంగా మధుర శ్రీధర్ తో ఓ సినిమాపై తీవ్రంగా చర్చించాడు. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో క్రికెటర్ కన్పిస్తాడట. అటు తనకు వచ్చిన క్రికెట్ ను కూడా కధలో కలిపేసి ఓ మిడిల్ క్లాస్ క్రికెటర్ పాత్రలో శ్రీశాంత్ నటించబోతున్నాడు. ఇంకేం తమ అభిమాన క్రికెటర్ ఆటను చూడలేకపోయామే అని బాదపడుతున్న అభిమానులకు తన నటనను చూపిస్తాడిప్పటినుంచి. కనీసం ఇక్కడైనా ఏ వివాదాలు లేకుండా అంటే మ్యాచ్ ఫిక్సింగ్ ఇక్కడ లేకపోయినా.., వివాదాలు లేని సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricketer sreeshanth  puri jagannath  telugu movies  cricket  

Other Articles