Deepika padukone controversial comments on dimple kapadia

deepika padukone, dimple kapadia, deepika padukone latest news, dimple kapadia latest news, findin fanny movie, finding fanny movie news, deepika padukone, deepika padukone finding fanny, deepika padukone movies, deepika padukone hot photos

deepika padukone controversial comments on dimple kapadia : bollywood hot actress deepika padukone controversial comments on dimple kapadia that she is making bad impression on her by appreciating.

నా కెరీర్ ను చెడగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు! దీపిక

Posted: 08/11/2014 06:54 PM IST
Deepika padukone controversial comments on dimple kapadia

వరుస విజయాలతో బాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న తార దీపికా పదుకునె! పైగా ఈ నటించిన సినిమాలన్నీ వందకోట్ల క్లబ్ లోకి చేరిపోవడంతో ఈ అమ్మడికి ఇప్పుడు బాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా అభివర్ణిస్తున్నారు. దీంతో ఈ అమ్మడికి ఒకటిమీద ఒకటి ఆఫర్లు వస్తూనే వున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు దాదాపు నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా వుంది.

ఇదిలావుండగా... తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో వున్న కొంతమంది సినీప్రముఖులు తనను పొగడ్తలతో ముంచెత్తి చెడగొడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను సాధించిన విజయాలను గురించి ఆమెను గారం చేస్తూ.. తన దృష్టిని మళ్లించేందుకు పన్నాగం పన్నుతున్నారని ఈమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ఈమెపై ఎవరో కుట్ర పన్నుతున్నారని, ఈమెను బాలీవుడ్ నుంచి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ లో చర్చించుకుంటున్న నేపథ్యంలో దీపికా పదుకునె కుండలు బద్దలు కొట్టింది. తాను ఆ మాటలను ఎవరిని ఉద్దేశించి చెప్పిందో చివరికి క్లారిఫికేషన్ ఇచ్చేసింది.

దీపికా పదుకునె తాజాగా నటిస్తున్న చిత్రం ‘‘ఫైండింగ్ ఫన్ని’’. ఈ సినిమాలో ఈమెతోపాటు డింపుల్ కపాడియా, అర్జున్ కపూర్, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్ వంటి తదితర నటులు నటిస్తున్నారు. వీరందరితో దీపికకు ఆ సినిమాలో వున్న మంచి సంబంధం గురించి వివరిస్తూ.. డింపుల్ కపాడియాతో వున్న అనుబంధం గురించి విశ్లేషించింది. ‘‘ఫైండింగ్ ఫన్నీ’’ సినిమాలో తామిద్దరం కలిసి నటిస్తున్నప్పుడు డింపుల్ తనను భోజననానికి బయటకు తీసుకెళ్లేదని, షాపింగ్ కూడా చేయించేదని చెప్పింది. ఆమె తనను కన్నకూతురిలా భావించి, ఎప్పుడూ గారం చేసేదని తెలిపింది. ఈ విధంగా డింపుల్ తనను గారం చేస్తూ.. తన గురించి గొప్పలు చెబుతూ చెడగొడుతున్నట్టు ఆమె కామెడీగా చెప్పినట్లు క్లారిఫికేషన్ ఇచ్చింది. దీనినే ఆమె కొంచెం సంచలనంగా మార్చి.. నా కెరీర్ ను చెడగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని స్టేట్ మెంట్ ఇచ్చింది.

అలాగే ఆ సినిమా విశేషాల గురించి చెబుతూ.. ఫైండింగ్ ఫన్నీ సినిమా ఇతర అన్ని సినిమాలకంటే చాలా విభిన్నంగా వుంటుందని, ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పింది. ఈ సినిమాలో మొదటిసారిగా తనకు తన మాతృభాష కొంకణిలో మాట్లాడే అవకాశం వచ్చిందని.. ఆ అవకాశాన్నిచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకుంది. హోమీ అడజానియా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ కానుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles