Bahubali records in overseas distribution

bahubali, prabhas, ss rajamouli, prabhas latest movie, keeravani, anushka, tamanna, telugu movie news, tollywood latest

bahubali movie set a new record in over seas distribution collection : prabhas latest movie bahubali creates an other record by overseas collection

రిలీజ్ కు ముందే బాహుబలి రికార్డులు

Posted: 08/11/2014 06:33 PM IST
Bahubali records in overseas distribution

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరి నోట విన్నా ఒకటే పేరు విన్పిస్తోంది. అదే బాహుబలి. సంచలనాలను క్రియేట్ చేయటంలో తనకు తానే సాటిగా నిలిచిన రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలపై అందర్లో ఆసక్తి నెలకొంది. రెండు సంవత్సరాల రాజమౌళి కష్టం ఎలా ఉంటుందో చూడాలని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను విడుదలకు ముందే తిరగరాస్తోంది.
        
ఇప్పటికే భారీ అంచనాలతో, సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి తాజాగా ఓవర్సీస్ డిస్ర్టిబ్యూషన్ లో రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనంతగా 9కోట్లను వసూలు చేసింది. సినిమా తొలి పార్ట్ కే ఈ మొత్తం రావటంతో సినిమా విడుదలయితే నిర్మాతల పంట పండినట్లే అని ఫిలింనగర్ టాక్. అన్నట్లు ఈ సినిమాకు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలుగా ఉన్నారు. తాజా వసూళ్ళతో వీరు లాబాలను వెనకేసుకుంటున్నారు. సినిమా తొలి పార్ట్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ 17న విడుదల అవుతుంది. తొలి పార్ట్ కే ఈ స్థాయి కలెక్షన్లుంటే, తర్వాతి పార్ట్ వస్తే పండగ చేసుకోవచ్చని అటు సినిమా యూనిట్, ఇటు అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు.
    
ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు దగ్గుబాటి రాణా, రమ్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో ఉన్నారు. ఎం. ఎం. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనటంతో ఏప్రిల్ 17కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
    
RK

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bahubali  prabhas  rajamouli  anushka  

Other Articles