Bipasha basu clarification about her relationship with bollywood hero harman haweja

bipasha basu latest news, bipasha basu harman baweja, harman baweja latest news, harman baweja bipasha basu, bipasha basu john abraham, bipasha basu hot photo shoot, bipasha basu yoga cd, bipasha basu latest photo shoot, bipasha basu news, bipasha basu live in relationship

bipasha basu clarification about her relationship with bollywood hero harman haweja : Bollywood sexy and hot beauty bipasha basu finally gives clarification about her relationship with harman baweja that they are in affair

బిపాషా ఆ హీరోలతో సహజీవనం చేసింది నిజమేనట!

Posted: 08/11/2014 12:18 PM IST
Bipasha basu clarification about her relationship with bollywood hero harman haweja

బాలీవుడ్ సెక్సీ హాట్ బ్యూట్ బిపాషా బసు మీద ఇన్నాళ్లవరకు వస్తున్న రూమర్స్ కు తెరపడేలా కొన్ని సంచలన వ్యాఖ్యలను చేసింది. ఈ అమ్మడు రోజుకు ఒక బాయ్ ఫ్రెండ్ ను మారుస్తూ పార్టీ పబ్బుల్లో అడ్డంగా దొరికిపోతోందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో... ఈ అమ్మడు తన ఎఫైర్ల గురించి అన్ని వివరాలు తెలిపింది. గతంలోనూ, ఇప్పుడు తనకు ఏ హీరోలతో ఎపైర్ వుందో అన్ని విషయాలను బహిర్గతం చేసి, తన మీద వస్తున్న రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది.

మొదట బిపాషా బసు జాన్ అబ్రహంతో కలిసి ప్రేమాయణం కొనసాగించిన విషయం గురించి అందరికీ తెలిసిందే! అప్పుడు దాదాపు వారిద్దరూ 7 సంవత్సరాల వరకు సహజీవనం చేశారు. ఇన్నాళ్లవరకు సహజీవనం చేసుకున్నారు కదా.. ఇక త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయమని అనుకున్న తరుణంలో... కొన్ని వ్యక్తిగత విభేదాలు రావడం వల్ల అప్పుడు విడిపోయారు. మళ్లీ అప్పుడప్పుడు పార్టీల్లో కలిసి తిరుగుతున్న దృశ్యాలు కనిపించేసరికి.. వీరిద్దరు తమ ప్రేమాయణాన్ని మళ్లీ మొదలు పెట్టారనే వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు ఆమె వాటిని ఖండిస్తూ... తమ మధ్య ఎటువంటి రిలేషన్ షిప్ లేదని కొట్టిపారేసింది.

జాన్ తో సంబంధం తెగిపోయిన తరువాత సినిమాల మీదే దృష్టి పెట్టానని ప్రకటించిన బిపాషా.. కొన్నాళ్లకే మరో బాలీవుడ్ హీరో అయిన హర్మన్ బవేజాతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రారంభించింది. ఇలా ఒకసారి కాదు... వీలు కుదిరినప్పుడల్లా వీరిద్దరూ కలిసి మిడ్ నైట్ పార్టీల్లో తిరిగేవారు. అప్పుడప్పుడు తామిద్దరూ కలిసి వున్న ప్రైవేట్ ఫోటోలను కూడా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేసుకునేవారు. దీంతో వీరిద్దరూ ప్రేమాయణం నడుపుతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే తమ మధ్య ఎటువంటి రిలేషన్ షిప్ లేదని, కేవలం మంచి ఫ్రెండ్సేనని చెప్పుకోవడం మొదలుపెట్టారే కానీ... పార్టీలకు, షికార్లకు తిరగడం మాత్రం మానేయలేదు.

ఇప్పుడు తాజాగా బిపాషా బసు తనకు, హర్మన్ బవేజా వున్న రిలేషన్ షిప్ నిజమేనని ఎట్టకేలకు ఒప్పేసుకుంది. గతంలో తాను జాన్ అబ్రహంతో సహజీవనం చేసింది నిజమేనని పేర్కొంటూ... ఇప్పుడు తాను హర్మన్ బవేజాతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయానని స్పష్టం చేసింది. తామిద్దరం సహజీవనం కూడా చేస్తున్నామని స్వయంగా బిపాషాయే ఒప్పుకుంది. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు..? అని ప్రశ్నిస్తే.. ‘‘ప్రస్తుతం తామిద్దరం సినిమాలతో బిజీగా వున్నామని.. కెరీర్ స్థిరపడిన తరువాతే పెళ్లి చేసుకుంటామని’’ ఆమె పేర్కొంది.

అయితే ఈవిడగారు ఇచ్చిన స్టేట్ మెంట్ కొంతమంది విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో జాన్ తో కలిసి ఏడేళ్లు సహజీవనం చేసినా కూడా కేవలం వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయినట్లే... ఇప్పుడు వీరిద్దరు కూడా విడిపోరని గ్యారెంటీ ఏంటి..? అనే ప్రశ్నలను వెల్లువెత్తుతున్నారు. మరి ఈ అమ్మడు ఈ ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు ఇస్తుందో..?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles