Hero vijay problems by kathi movie

hero vijay, kathi movie, vijay latest movie, kathi movie news, tamil movies, kathi hero

hero vijay faces problems by kathi movie : tamil organisations against kathi movie police gives protection to vijay house

విజయ్ కు కత్తి కష్టాలు

Posted: 08/11/2014 11:43 AM IST
Hero vijay problems by kathi movie

విజయ్ కు కత్తి కష్టాలు మొదలయ్యాయి. అదేనండి తన తాజా చిత్రం కత్తి కొత్త వివాదాలను తెచ్చి పెడుతోంది. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. నిర్మాత దగ్గరే వచ్చింది అసలు చిక్కు. ఈ సినిమాను లైకా సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ యాజమాన్యానికి, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు దగ్గరి సంబందాలున్నాయని గుసగుసలు విన్పించాయి. ఇంకేముంది లంక అంటేనే ఒంటికాలిపై లేచే తమిళ తంబీలు, లైకా నిర్మించే చిత్రంలో విజయ్ నటించటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మనమంటే పడని వారితో మనవాడు కలిసి పనిచేయటమేంటని చర్చ మొదలుపెట్టాయి.

తమ నటుడు లంక వారితో పనిచేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. విషయం తెలుసుకున్న డైరెక్టర్ మురుగదాస్ తమిళ సంఘాలతో చర్చలు జరిపారు. వివాదం చేయవద్దని విగ్నప్తి చేశాడు. అయితే లైకాతో సంబంధం తెంచుకునే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తమిళ సంఘాల ప్రతినిధులు తేల్చి చెప్పారు. అంతేకాదు విజయ్ ఇంటిని ముట్టడించాలని కూడా వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పోలిసులకు తెలియటంతో హీరో ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. యాబై మంది పోలిసులను ముందు జాగ్రత్త చర్యగా మోహరించారు.

తమిళులకు సెంటిమెంట్ ను ఎంత గౌరవిస్తారో అందరికి తెలుసు. ముఖ్యంగా బాష, సాంప్రదాయం, ఆచారాల విషయంలో వారు ఎవరు చెప్పినా వినరు. ఎక్కడకు వెళ్ళినా వారి ఐడెంటిటి  వారిదే. సెంటిమెంట్ల వల్ల ప్రభుత్వాలే కూలిపోయిన సందర్బాలు తమిళనాట ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా తీస్తే ఇలాగే అవుతుందని తమిళ సంఘాలు చెప్తున్నాయి. అయితే లైకాకు రాజపక్సేతో సంబంధాలపై తమకెలాంటి సమాచారం లేదని కత్తి చిత్ర వర్గాలు చెప్తున్నాయి. తమకు కూడా సెంటిమెంట్ ఉందని అంటున్నారు.

వివాదాలు విజయ్ కు కొత్త కాదు!!

విజయ్ కు ఈ సినిమాతోనే వివాదాలు మొదలు కాలేదు. మనవాడికి చిత్ర గొడవల్లో గతానుభవం ఉంది. గతంలో వచ్చిన తలవా సినిమాను కూడా తమిళ సంఘాలు వ్యతిరేకించాయి. చిత్ర ప్రదర్శన సమయంలోనూ వివాదాలు నడిచాయి. అయితే అవి సద్దుమణగగా తాజా వివాదం ఎటు వెళ్తుందో వేచి చూడాలి.

RK

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero vijay  kathi  latest movie news  tamil movies  

Other Articles

Today on Telugu Wishesh