Gabbar singh 2 movie shooting cancelled

gabbar singh 2 movie shooting cancelled, gabbar singh 2 script and screenplay not ready yet, pawan kalyan latest news, pawan kalyan gabbar singh 2 movie, pawan kalyan in gabbar singh movie, gabbar singh 2 movie news, pawan kalyan brand ambassador for andhra pradesh, pawan kalyan latest movie news, pawan kalyan in gopala gopala movie, pawan kalyan gabbar singh movie, kajal agarwal in gabbar singh 2 movie

pawan kalyan gabbar singh 2 movie shooting cancelled due to script and screenplay not ready yet

ఏందయ్యా పవను.. అందరి నమ్మకాలు వొమ్ము చేసితివి!

Posted: 07/30/2014 10:33 AM IST
Gabbar singh 2 movie shooting cancelled

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అందరి నమ్మకాలను వొమ్ము చేసేశారు. ఇన్నాళ్లవరకు తెలుగు ప్రేక్షకులను, ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచేశారు. సంవత్సరకాలం నుంచి ‘‘గబ్బర్ సింగ్-2’’ సినిమా ఇదిగో ఇప్పుడు, అదిగో అప్పుడు సెట్స్ పైకి వెళ్తుందని అందరినీ ఊరించి... చివరికి నోటినుంచి మెతుకును లాగేసుకున్నట్టు ఆ సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టేశారని తాజా విశ్వసనీయ సమాచారం! ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పక్కనపెట్టేసి ఆయన మరో సినిమాకు కమిట్ అయ్యే అవకాశాలు చాలావున్నాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ సంవత్సరం అక్టోబర్ నెలనుంచి ‘‘గబ్బర్ సింగ్ - 2’’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వెలువడిన నేపథ్యంలో... దీనిని ఖండిస్తూ పవన్ వేరే ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు ఫిల్మ్ నగర్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఇందుకు ముఖ్య కారణం ఏమిటంటే.. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న డైరెక్టర్ సంపత్ నంది ఇంతవరకు ఈ సినిమా స్ర్కిప్ట్ - స్ర్కీన్ ప్లే పవన్ కల్యాణ్ కు మెచ్చేలా డిజైన్ చేయలేదని తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ మూవీ స్ర్కిప్ట్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయి, తన పంచ్ డైలాగులను అందిస్తాడేమోనని పవన్ భావించినా.. అలా జరగలేదు. మరోవైపు ఈ సినిమాకు హీరోయిన్ కోసం ఎంతమందిని సంప్రదించినా ఏ హీరోయిన్ కూడా సెట్ కాకపోవడం!

అందువల్ల ఇన్ని లోపాలున్న ఈ సినిమాను హడావుడి చేసి సెట్స్ పైకి తీసుకెళ్లితే సరిగ్గా సమకూర్చలేమని, అభిమానులను సంతోషపరచలేమని తెలుసుకుని పవన్ కల్యాణ్ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టేశారని ఇన్ సైడ్ టాక్! దీంతో తమ అభిమాన నటుడు పవన్ కల్యాణ్ ‘‘గబ్బర్ సింగ్ - 2’’ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న నేపథ్యంలో... ఈ వార్తల అనంతరం నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles