Soha ali khan kunal khemu love marriage plans

Soha ali khan kunal khemu love marriage plans, soha ali khan latest news, soha ali khan kunal khemu news, soha ali khan kunal khemu photos, soha ali khan kunal khemu love affair, soha ali khan kunal khemu, soha ali khan bikini photos, soha ali khan marriage, soha ali khan love affairs

soha ali khan and kunal khemu love affair

ఇన్నాళ్లు దాచుకున్న రహస్యాన్ని బయటపెట్టేసింది!

Posted: 07/25/2014 01:25 PM IST
Soha ali khan kunal khemu love marriage plans

నవాబుల కుటుంబం నుంచి బాలీవుడ్ తెరకు పరిచయమైన నటుడు సైఫ్ అలా ఖాన్ చెల్లెలు సోహా అలీ ఖాన్... ఇన్నాళ్లవరకు దాచుకున్న తన రహస్య విషయం గురించి బయటపెట్టేసింది. ఇన్నాళ్లవరకు ఈ అమ్మడు, నటుడు కునాల్ ఖేములు ఇద్దరు గుట్టుచప్పుడు కాకుండా చట్టాపట్టాలేసుకుని, పీకల్లోతుదాకా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే! కానీ వీరిద్దరూ మాత్రం తమ మధ్య ఏమీలేదని, కేవలం మంచి మిత్రులమేనని చెప్పుకుంటూనే వచ్చారే తప్ప... తమ మనసులో దాగి వున్న ప్రేమరహస్యాన్ని మాత్రం చెప్పలేదు.

గతంలో ఈ ప్రేమజంటలు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో సోహాకు, తన అన్నయ్య సైఫ్ తో చాలాసార్లు గొడవలు అయ్యాయి. సైఫ్, కునాల్ ఖేముని తన చెల్లెలను కలవొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా ఆమధ్య వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా వీరిద్దరూ రహస్యంగా తమ ప్రేమాయణాన్ని నడుపుతుండేవారు. రాత్రి పార్టీలకు హాజరవుతూ, అప్పుడప్పుడు కెమెరాలలో బంధింపబడేవారు. ఇప్పడు వీరి ప్రేమకథ చివరికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా సోహా అలీ ఖాన్ ట్విటర్ తన అభిమానులకు తన పెళ్లి విషయాన్ని పంచుకుంది. త్వరలోనే తాను, కునాల్ పెళ్లి చేసుకోబోతున్నామని ఒప్పుకుని, తన ప్రేమకు శుభం కార్డు పలికింది. ఈ ప్రేమజంట పారిస్ టూర్ కు వెళ్లినప్పుడు అక్కడ కునాల్ తన ప్రేమను వ్యక్తం చేసి ప్రపోజ్ చేశాడని, వెంటనే తాను ఒప్పుకున్నట్టు ఆమె పేర్కొంది. కునాల్ లాంటి తగిన జోడి తనకు ఎక్కడా దొరకడని, అందుకే తన ప్రేమను ఒప్పుకుని, పెళ్లికి సిద్ధమయ్యానంటూ ఆమె స్పష్టం చేసింది. ఇంకొక విశేషమేమిటంటే... వీరిద్దరి పెళ్లికి సోహా తల్లి షర్మిలా ఠాగోర్, సోదరుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు బాలీవుడ్ లో చర్చలు జోరుగా సాగిపోతున్నాయి కూడా!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh