Gopala gopala movie first look release

Pawan kalyan gopala gopala movie first look to be released on august 16, pawan kalyan latest news, pawan kalyan with venkatesh, gopala gopala movie first look release, gopala gopala movie first look, gopala gopala movie title first look, pawan kalyan as modern krishna in gopala gopala movie, pawan kalyan krishna avatar in gopala gopala movie, gopala gopala movie opening stills, gopala gopala movie stills

Pawan kalyan gopala gopala movie first look to be released on august 16

‘‘గోపాల గోపాల’’ ఫస్ట్ లుక్ విడుదల!

Posted: 07/24/2014 04:45 PM IST
Gopala gopala movie first look release

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్ ఇద్దరూ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ సినిమా ‘‘గోపాల గోపాల’’! ఈ చిత్రంలో మోడ్రన్ కృష్ణుడిగా నటిస్తున్న పవన్.. సోమవారం నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సెట్ కు హాజరయిన తొలిరోజు నుంచే పవర్ స్టార్ దూకుడుగా ప్రదర్శిస్తున్నాడని.. రోజుకు దాదాపు 4 నుంచి 5 సన్నివేశాల షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంటున్నాడని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పవన్ ఈ సినిమాకు కేవలం 20 రోజులవరకు మాత్రమే కాల్షీట్లు ఇచ్చిన నేపథ్యంలో తాను సమయాన్ని వృధా చేయకుండా అన్నివిధాలుగా జాగ్రత్త పడుతున్నాడు.

ఇదిలావుండగా... ‘‘గోపాల గోపాల’’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల తేదీని దర్శకనిర్మాతలు దాదాపు ఖరారు చేసినట్లు తాజా వార్తల సమాచారం! ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆగస్ట్ 16వ తేదీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా ఆరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం కూడా! దీంతో ఆరోజు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తే శుభసూచికం అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట! అంతేకాకుండా పవన్ కల్యాణ్ కూడా ఇందులో కృష్ణుడి అవతారంలో కనిపించనున్నాడు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి నాడే విడుదల చేయాలని టోటల్ గా ఫిక్స్ అయ్యారని చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మాత్రం దర్శకనిర్మాతలు ఇంకా వెల్లడించాల్సి వుంది.

ఈ చిత్రంలో వెంకటేష్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా నటిస్తుండగా... అతని సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కల్యాణ్ పాత్ర ఇందులో కేవలం 25 నిముషాల వరకు మాత్రమే వుంటుందని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. సురేష్ బాబు - శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నీ అనుకున్నవిధంగా సజావుగా సాగితే 2015 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles