Daggubati rana comments on pawan kalyan

Daggubati Rana praises pawan kalyan as truly super star in twitter, daggubati rana latest news, pawan kalyan latest news, daggubati rana comments on pawan kalyan, pawan kalyan with daggubati rana, daggubati rana comments on pawan kalyan, pawan kalyan gabbar singh 2 movie, pawan kalyan fans, pawan kalyan facebook, pawan kalyan photos, daggubati rana photos

Daggubati Rana praises pawan kalyan as truly super star in social networks

పవర్ కు వున్న స్టార్.. మరెవ్వరికీ లేదట!

Posted: 07/19/2014 03:06 PM IST
Daggubati rana comments on pawan kalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇమేజ్ మన తెలుగు చిత్రపరిశ్రమలో ఏ రేంజులో వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు! ఈయన నటించిన ‘‘అత్తారింటికి దారేది’’ సినిమా రిలీజ్ కు ముందే పైరసీ వచ్చినప్పటికీ... ఈయన క్రేజ్ ముందు వాటిమంత్రి పనిచేయలేదు. దాదాపు 85 కోట్ల రూపాయల వరకు భారీ కలెక్షన్లు రాబట్టి.. టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకుంది ఆ సినిమా! ఈ ఒక్క ఉదాహరణ చాలు... పవన్ అభిమానుల్లో ఈయన క్రేజ్ ఎంతుందో తెలుసుకోవడానికి! పవన్ కల్యాణ్ లాంటి స్టార్ మరెవ్వరూ లేరంటూ నినాదాలు చేసుకుంటూ.. ఈయనకు పూజలు చేస్తుంటారు.

పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లోనే కాదు... యావత్తు భారతదేశం మొత్తం మీద వున్నారు. సాధారణ వ్యక్తుల నుంచి స్టార్ హీరోల వరకు ఈయన నామస్మరణ చేసుకుంటూ వుంటారు. సౌత్ ఇండస్ట్రీలో వున్న స్టార్ హీరోలందరూ ఈయన అభిమానులే! ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి హీరో దగ్గుబాటి రానా కూడా చేరిపోయాడు. ఈయన నామస్మరణ చేసుకుంటూ ఈయనలా మరెవ్వరూ వుండరని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు.

‘‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్రూలీ సూపర్ స్టార్’’ అంటూ సోషల్ మీడియాలో ఆయన ఫోటో పెట్టి మరీ పోస్ట్ చేశాడు రానా! ఈ పోస్ట్ పై పవన్ అభిమానులు కూడా తమ హర్షం వ్యక్తం చేశారు. వారు కూడా తమ అభిమానాన్ని చాటుకుంటూ పవన్ కల్యాణ్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ అంటూ కామెంట్లు చేశారు. అయితే రానా ఈ విధంగా పోస్ట్ చేయడంపై కొంతమంది మాత్రం... ఈయన ఇమేజ్ ను క్యాచ్ చేసుకుని, పవన్ అభిమానుల్లో స్థానం సంపాదించుకోవడానికే ఇలా చేశాడంటూ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా... ఇక్కడ హైలైట్ అయింది మాత్రం పవన్ కల్యాణే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles