Junior ntr donates 3 lakh rupees for his workers father treatement

Junior ntr donates 3 lakh rupees for his workers father treatement, junior ntr latest news, junior ntr with staff members, junior ntr newss, junior ntr in dammu movie, junior ntr helps his worker for father treatment, junior ntr gave 3 lakh rupess to his worker, junior ntr in rabhasa movie, junior ntr latest movie news, junior ntr comments on pawan kalyan, junior ntr with pawan kalyan,

Junior ntr donates 3 lakh rupees for his workers father treatement

రీల్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ ‘‘దమ్ము’’న్నవాడే!

Posted: 07/19/2014 02:19 PM IST
Junior ntr donates 3 lakh rupees for his workers father treatement

(Image source from: Junior ntr donates 3 lakh rupees for his workers father treatement)

‘‘నేను బాగుంటే చాలు... వేరేవాళ్లు ఎలా ఛస్తే నాకేంటి..? నేను మాత్రమే బాగుండాలి’’ అని మన సమాజంలో భావించుకునేవారు చాలామంది వుంటారు. పేదోడి నుంచి అంతరిక్షంవరకు ప్రయాణం చేసివారి వరకు సాధ్యమైనంతవరకు ఇలాగే ఆలోచిస్తుంటారు. ‘‘మనం బాగుండాలి. మనతో వున్నవారు సంతోషంగా వుండాలి. అందరూ ఆనందంగా సమయాన్ని గడుపుతుంటే వారితో నేను కూడా పాలుపంచుకోవాలి’’ అనే సూత్రాన్ని మాత్రం లక్షమందిలో ఒక్కరు మాత్రమే పాటిస్తారు.

ఇక సినిమా జగత్తులోకి వస్తే కథానాయకులంతా తమ పర్సనల్ లైఫ్ లో ఎలా వుంటారో తెలియదు కానీ... తెరమీద మాత్రం శ్రీరామచంద్రునిలాగా నీతికబుర్లు చెబుతూ కనిపిస్తుంటారు. అయితే ఇందులో కొంతమంది తారలు ఎలావున్నా... నిజజీవితంలో కూడా నలుగురికోసం పాటుపడేవారు చాలామందే ముందుకొచ్చారు. తమ తోటి స్నేహితులకోసం, తమ దగ్గర పనిచేసేవారికోసం, ఇంకా ఇతర కష్టసమయాల్లో సహాయం చేసినవారు ఎందరో మహానుభావులు వున్నారు. ఇటువంటి కోవలలోకే మన టాలీవుడ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా తాజాగా చేరిపోయారు.

‘‘అందరూ బాగుండాలి. ఆ అందరి మధ్య నేనుండాలి’’ అనే డైలాగులో వున్న నీతిని జూనియర్ ఎన్టీఆర్ ‘‘దమ్ము’’ సినిమాలో కనబరిచాడు. తెరమీద ధీరోదాత్తుడిగా కనిపిస్తూ అందరికీ చేయూతనిచ్చే మనిషిగా మెప్పించాడు. ఏవిధంగా అయితే ఆయన దమ్ము సినిమాలో తన మానవనైజాన్ని కనబరిచాడో... నిజజీవితంలో కూడా అలాగే నడుకుంటాడని అతని చుట్టూ వున్న సినీజనాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఆయనతో తాజాగా ఓ సంఘటన చేసుకుంది.

తన దగ్గర పనిచేసే వ్యక్తి తండ్రికి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయం తెలిసిన వెంటనే అతను వెంటనే ఆ వ్యక్తికి వైద్యం కోసం ఎంత ఖర్చవుతుందని అడిగాడట. దానికి సదరు వ్యక్తి స్పందించి దాదాపు రూ.3 వరకు డబ్బు అవసరం అవుతుందని సమాధానం ఇచ్చాడు. దీంతో ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ ఆ మొత్తం డబ్బును ఆ వ్యక్తికి ధారబోశాడు. ‘‘ముందు మీ నాన్న ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో...! ఆయనకు ఏమీ అవ్వదు. నువ్వు భయపడకుండా ధైర్యంగా వుండు. నేనున్నాను’’ అంటూ ధైర్యం చెప్పి పంపించాడని ఆయన దగ్గరున్న స్టాఫ్ మొత్తం చెప్పుకుంటున్నారు.

ఎన్టీఆర్ దాతృత్వాన్ని కళ్లారా వీక్షించిన ఆయన స్టాఫ్... ఈ విషయం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. సాటి మనిషికి సాయం చేయడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడని, ఇటువంటి వ్యక్తి దగ్గర పనిచేస్తుందన్నందుకు చాలా సంతోషంగా వుందంటూ వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో ఎవరికెవరూ అంటూ బతుకున్న రోజుల్లో... ఎన్టీఆర్ ఈ విధంగా దానం చేయడం ఎంతో గొప్ప విషయమంటూ ఆయన గురించి పొగుడుతూ చెబుతున్నారు. హ్యాట్సాఫ్ ఎన్టీఆర్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles